మనం ఆరోగ్యంగా ఉండేందుకు పలు రకాల పండ్లను ఏదో ఒక రూపంలో తింటూనే ఉంటాము. అలా తినేటటువంటి పండ్లలో పనసపండు కూడా ఒకటి. ఈ పనస పండు తినడం వల్ల మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఇక ఈ పనస పండులోని విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీంతో మానసిక ఉల్లాసం పెరిగి అలసట తగ్గిపోతుంది ఇక అంతే కాకుండా చర్మ సౌందర్యం తో పాటు ఆరోగ్యవంతంగా ఉండేలా సహకరిస్తుంది. అయితే వీటిని తినని వారు వీటి యొక్క ఉపయోగాలు తెలిస్తే ఎంతో ఇష్టపడి తింటారు అని వైద్యులు తెలియజేస్తున్నారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఇందులోని వచ్చిన గింజలు ఉడికిన తర్వాత తినడం వల్ల చాలా రుచిగా కూడా ఉంటాయి. లేదంటే వీటిని కాల్చి అయినా తినవచ్చు.
1).మన శరీరంలో ఐరన్ లోపం ఉంటే ఈ పనస కాయలు తినడం వల్ల రక్తహీనత సమస్యను దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
2). పనస పండులో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇక అంతే కాకుండా రక్తపోటు నియంత్రణలో కూడా చాలా సహాయపడుతుంది.
3). పనస పండులో అధికంగా విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని చాలా బలంగా ఉండేలా చేస్తుంది.. అందుచేతనే ఆహారంలో కనీసం నెలలో ఒకసారి అయిన ఈ పనస పండు కాయలను తినడం మంచిది.
4). జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉండే వారు ఈ పనస గింజలు తినడం వల్ల ఆ సమస్యను దూరం చేస్తుంది.. పనస పండు లో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను కూడా మనం దూరం చేసుకోవచ్చు.
5). ముఖ్యంగా మగవారు వీటిని తినడం వల్ల వీర్యకణాల సంఖ్య సమృద్ధిగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.