కొబ్బరి టీ వలన కలిగే లాభాలను చూస్తే అవాక్ అవుతారు..!

-

కొబ్బరి టీ గురించి ఎప్పుడైనా విన్నారా..? కొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పైగా చాలా సమస్యల్ని తరిమికొడుతుంది. కొబ్బరి టీ ని ఎలా తయారు చేసుకోవాలి..?, దాని వల్ల కలిగే లాభాలు ఏమిటి అనే దాని గురించి ఆరోగ్య నిపుణులు చెప్పారు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం. కొబ్బరి తో పాటు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తో తయారు చేసుకోవచ్చు.

 

కొబ్బరి పాల వలన ఇన్ని లాభాలు పొందొచ్చు:

కొబ్బరి పాలల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. అలానే లారిక్ యాసిడ్ కూడా కొబ్బరి పాలలో ఎక్కువగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్:

అదే విధంగా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఇలా ఉంటే గ్రీన్ టీ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బరువు కూడా తగ్గచ్చు:

అలానే కొబ్బరి లో విటమిన్ సి కూడా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

హృదయ సంబంధిత సమస్యలు వుండవు:

కార్డియో వాస్కులర్ హెల్త్ కి కూడా ఇది చాలా మంచిది. బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలానే హృదయ సంబంధిత సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి.

కొబ్బరి టీ ని ఎలా తయారు చేసుకోవాలి..?

కొబ్బరి టీ ని తయారు చేసుకోవడానికి ముందుగా నాలుగు కప్పుల నీళ్లు తీసుకోవాలి.
ఈ నీటిని మరిగించి అందులో మూడు బ్యాగుల గ్రీన్ టీ ని వేసుకోవాలి.
ఆ తర్వాత పావు కప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల క్రీం వేసుకోవాలి.
దీనిని బాగా షేక్ చేసి టీ బ్యాగులను తొలగించాలి.
కావాలనుకుంటే ఇందులో మీరు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version