చిలగడదుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి చాలా మంది చిలగడదుంపలుని ఎక్కువగా తింటూ ఉంటారు రకరకాల ప్రయోజనాలను మనం చిలగడదుంపలు తో పొందొచ్చు చిలగడదుంపలు లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే చిలగడదుంపలు తీసుకోవడం వలన పోషక పదార్థాలు బాగా అందుతాయి. సోడియం పొటాషియం ఐరన్ విటమిన్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చు కానీ లిమిట్ గానే తీసుకోవాలి బాగా ఎక్కువగా చిలగడదుంపలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అజీర్తి సమస్యలు కలుగుతూ ఉంటాయి.
ముఖ్యంగా వేసవికాలంలో చిలగడదుంపలు ఎక్కువగా తీసుకుంటే అజీర్తి సమస్యలు కలుగుతాయి అలానే వాంతులు గ్యాస్ వంటి ఇబ్బందులు వస్తాయి. చిలగడదుంపలు బాగా ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ వాళ్లకి అసలు మంచిది కాదు. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు అతిగా తీసుకోవద్దు.
చిలగడదుంపలు ఎక్కువగా తీసుకోవడం వలన నీరసం కూడా వస్తుంది ఇందులో 97% నీళ్లు ఉంటాయి అతిగా తీసుకోవడం వలన ఎక్కువ నీరసం కాళ్లలో వాపులు వంటివి వస్తాయి కాబట్టి లిమిట్ గానే తీసుకోండి ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు తప్పవు. వేసవికాలంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి. వేసవికాలంలో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకుంటే సమస్యలు ఏమి లేకుండా ఉండొచ్చు. డిహైడ్రేషన్ వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవికాలంలో మంచినీళ్ళని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి అలానే వేసవికాలంలో బాగా స్పైసి ఫుడ్ ఆయిల్ ఫుడ్ వంటివి తీసుకోకండి.