పొరపాటున కూడా మెడిసిన్స్ తో పాటు.. ఈ ఆహార పదార్దాలని అస్సలు తీసుకోవద్దు..!

-

చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు మంచిగా ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అలానే కొన్ని కాంబినేషన్స్ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని వెంటనే మరి కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది లేనిపోని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, నీళ్లు తీసుకోవడం,ఆరోగ్యానికి మేలు చేసే వాటిని డైట్ లో చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎంతో అవసరం. అయితే చాలామంది మందులు వేసుకుంటూ ఉంటారు కొన్ని రకాల సమస్యల వలన మెడిసిన్స్ వాడుతున్నట్లయితే మీరు కూడా వీటిని తప్పక చూడాలి.

 

మెడిసిన్ తీసుకుని వెంటనే వీటిని తీసుకుంటే కచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి అని గుర్తుపెట్టుకోండి. మందుల్ని వేసుకున్న తర్వాత ఎనర్జీ డ్రింక్స్ ని అసలు తీసుకోకూడదు మందులతో పాటు ఎనర్జీ డ్రింక్స్ ని తీసుకుంటే వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే స్మోకింగ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఆల్కహాల్ ని కూడా తీసుకోవడం మంచిది కాదు.

మెడిసిన్ తీసుకున్న తర్వాత స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం కూడా సైడ్ ఎఫెక్ట్స్ ని కలిగిస్తుంది. లివర్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. పాలు ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది పాలతో మందుల్ని తీసుకుంటుంటారు అది కూడా ఆరోగ్యానికి హానిచేస్తుంది పాలు పాల పదార్థాలని యాంటీబయటిక్స్ తో అసలు తీసుకోకండి ఇలా ఈ తప్పులు చేయకుండా చూసుకుంటూ ఉండండి లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి కాబట్టి ఈ పొరపాట్లని చేయకుండా చూసుకోండి లేకపోతే సమస్యలు తప్పవు.

Read more RELATED
Recommended to you

Latest news