మనం తీసుకునే ఆహారం, మన యొక్క జీవనశైలి బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంది. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఆయుర్వేద మూలికలు కూడా బాగా ఉపయోగపడతాయి. పైగా వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం మొదలు ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి ఈ ఆయుర్వేద మూలికలు మనకు సహాయం చేస్తాయి. మరి వాటి కోసం చూద్దాం.
అశ్వగంధ:
అశ్వగంధ యాంగ్జైటీ, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి అశ్వగంధ సహాయం చేస్తుంది. అలానే ఎనర్జీ లెవెల్స్ ని పెంపొందిస్తుంది. రోగనిరోధకశక్తిని కూడా పెంపొందించుకోవచ్చు.
త్రిఫల:
త్రిఫల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. దంత సమస్యలు మొదలు అజీర్తి సమస్యల వరకు ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనితో చాలా సమస్యలు మనం తరిమికొట్టొచ్చు.
పసుపు:
మనం వంటల్లో ఎక్కువగా పసుపు వాడుతూనే ఉంటాం. దీని వల్ల చాలా ప్రయోజనం పొందవచ్చు. ఎముకల నొప్పులు, అలసట మొదలైన సమస్యల నుండి బయట పడేస్తుంది. గొంతులో ఇబ్బందులు జలుబు లాంటి సమస్యలు కూడా ఇది పరిష్కరిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
యాలుకలు:
యాలకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అదేవిధంగా యాలకలు క్యాన్సర్ సమస్య రాకుండా చూసుకుంటాయి. రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది.
బ్రహ్మీ:
మెదడు ఆరోగ్యానికి బ్రహ్మీ ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మనకు సహాయం చేస్తుంది. యాంగ్జైటీ, ఒత్తిడి వంటి సమస్యలను తొలగిస్తుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇలా అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోచ్చు. అదేవిధంగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తద్వారా మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అవుతుంది.