కన్సీవ్ అయ్యే అవకాశాన్ని ఇలా పెంచుకోండి…!

-

ప్రెగ్నెన్సీ అనేది చాలా కఠినమైన ప్రాసెస్. కొందరు భార్య భర్తలు కన్సీవ్ అవ్వడానికి నెల రోజులు పడితే… మరికొందరికి ఎక్కువ కాలం పడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండాలన్నా… ఏ సమస్యలు లేకుండా ఉండాలన్నా ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి.

 

మెడికల్ టెస్ట్:

టెస్ట్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు, కాంప్లికేషన్స్ వంటివి తెలుస్తాయి. మీరు మరియు మీ పార్టనర్ ఇద్దరూ కూడా మెడికల్ చెకప్ చేయించుకోవడం చాలా ముఖ్యం. మీరు కన్సీవ్ అవ్వడానికి ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనేది తెలుస్తుంది. అలానే మీ ఫ్యామిలీ హిస్టరీ వంటివి కూడా పరిశీలించి చూస్తారు.

మందులని పరిశీలించడం:

మీరు రెగ్యులర్ గా ఏమైనా మందులు వాడుతుంటే వాటిని చూస్తారు. అయితే సాధారణంగా మనం రోజూ తలనొప్పికి, జలుబుకి మందులు వాడుతూ ఉంటాము. వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది కూడా పరిశీలిస్తారు.

మల్టీ విటమిన్స్:

9 నెలలు గర్భిణీకి చాలా కష్టం. ప్రెగ్నెన్సీ సమయంలో ఫిజికల్ మరియు ఎమోషనల్ గా మార్పులు వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషక పదార్థాలు తీసుకోవాలి. అందుకని మల్టీ విటమిన్స్ ని తప్పక తీసుకోవాలి.

బరువుని మేనేజ్ చేసుకోండి:

అధిక బరువు ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో సమస్యలు వస్తాయి. కాబట్టి బరువును కూడా కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

ఆరోగ్యకరమైన జీవన విధానం:

స్మోకింగ్, డ్రింకింగ్ వంటివాటికి దూరంగా ఉండాలి. అలాగే రోజుకు 8 నుండి 9 గంటల పాటు నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం.

వ్యాయామం:

ప్రెగ్నెన్సీ సమయంలో ఇది కూడా చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీకి ముందు కూడా వ్యాయామం చాలా ముఖ్యం. అందుకని మీరు కాస్త సమయాన్ని వ్యాయామం కోసం వెచ్చించండి. ఇది కూడా మీకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జంక్ మరియు ఫ్యాట్ ఫుడ్స్ ను తినకుండా ఆకుకూరలు, పండ్లు వంటివి అలవాటు చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news