గర్భిణీలు వీటిని తీసుకుంటే పుట్టే పిల్లలకి మంచిది..!

-

ఎంత మంచి పోషకాహారం తీసుకుంటే శిశువుకి అంత మంచిది. మీరు తీసుకునే ఆహారం మీద శిశువు అభివృద్ధి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో 10 నుండి 12 కేజీల వరకు బరువు పెరగవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీటిని కనుక తీసుకుంటే కచ్చితంగా శిశువు ఆరోగ్యంగా ఉండడానికి వీలు అవుతుంది.

ఐరన్ :

ఐరన్ హెమోగ్లోబిన్ కి అవసరం. అలానే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఐరన్ కనుక తక్కువగా ఉంటే ఎనీమియా సమస్య వస్తుంది. దీని కారణంగా శిశువు తక్కువ బరువు తో జన్మించడం మరియు డిప్రెషన్ లాంటి సమస్యలు వస్తాయి. ఆకుకూరలు, బీన్స్, డ్రై ఫ్రూట్ మొదలైన వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ డైట్ లో ఎక్కువగా తీసుకోండి. అలానే విటమిన్ సి తీసుకోవడం వల్ల కూడా మీకు ఐరన్ అందుతుంది. కాబట్టి ఉసిరి, జామ, కమలా కూడా మీరు డైట్ లో తీసుకోండి.

ఫాలిక్ యాసిడ్:

ఫాలిక్ యాసిడ్ లేదా ఫాలేట్ అనేది విటమిన్-డి. ఇది కొన్ని సమస్యలు లేకుండా ఉంచుతుంది. దీని వలన స్పైనల్ కార్డ్ సమస్యలు లేకుండా ఇది బాగా చూస్తుంది. ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ప్రి మెచూర్ బర్త్ రిస్క్ తగ్గుతుంది మరియు శిశువు బరువు కూడా పెరగడానికి సహాయపడుతుంది.

కాల్షియం:

కాల్షియం ఎముకలు మరియు దంతాలని దృఢంగా ఉంచుతుంది. ఆకుకూరల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక డైట్ లో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.

విటమిన్ డి:

విటమిన్-డి శిశువు ఎముకలకు మరియు దంతాలకి బాగా అవసరం. విటమిన్ డి లోపం కనుక ఉంటే రికెట్స్ సమస్య వస్తుంది.

ప్రోటీన్స్:

ప్రోటీన్స్ వలన కూడా శిశువు ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువగా ప్రోటీన్స్ చేప, గుడ్లు, సోయా బీన్స్, బఠాణీ, పాల పదార్థాలు మొదలైన వాటిలో ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా తీసుకోండి. వీటితో పాటుగా రెగ్యులర్ హెల్త్ చెకప్ కూడా చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news