“రిపబ్లిక్” సినిమాకు ఏపీలో నిరసన సెగ

ప గో జిల్లా : హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా కు నిరసన సెగ తగిలింది. రిపబ్లిక్ సినిమా పై కొల్లేరు గ్రామాల వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. రిపబ్లిక్ సినిమా లో చెరువు లను, చేపలను విషతుల్యం చేస్తున్నామని తమ గ్రామాల పై దుష్ప్రచారం చేశారని చిత్ర బృందం పై మండిపడ్డారు కొల్లేరు గ్రామాల వాసులు.

కొల్లేరు వాసుల మనోభావాలు దెబ్బతిసే విధoగా దర్శకుడు దేవా కట్టా చిత్రీకరణ చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు. వెంటనే రిపబ్లిక్ సినిమాను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కొల్లేరు వాసులు నిరసన కు దిగారు. రిపబ్లిక్ సినిమా వెంటనే ఆపి వేయలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కలెక్టర్ కార్తికేయ మిశ్రా కి వినతి పత్రం ఇచ్చారు కొల్లేరు గ్రామాల వాసులు. రిపబ్లిక్ సినిమా వెంటనే ఆపి వేయక పోతే ప్రత్యేక్ష ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు.