ఊబకాయానికి బేరియాట్రిక్ సర్జరీ మంచిదేనా..?నష్టం ఉందా..?

-

అధిక బరువు..ఈరోజుల్లో ప్రతి పదిమందిలో ఆరుగురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరిగిపోతున్నాం అని మనం గ్రహించేలోపే..ఊహించని వెయిట్ గెయిన్ అవుతారు..తగ్గించే ప్రయత్నాలు మొదలెట్టేలోపే…పరిస్థితి ఇంకాస్త క్రిటికల్ అవుతుంది. అధిక బరువు కాస్తా.ఊబకాయంగా మారి..ఫలింతంగా లేనిపోని రోగాల భారినపడాల్సి వస్తుంది. అధిక బరువు స్టేజ్ లోనే..ఏమైనా వ్యామాలు, డైట్ వంటివి చేస్తే తగ్గొచ్చు..ఎప్పుడైతే ఊబకాయం బారిన పడ్డారో నార్మల్ అవడం కష్టమే. అయితే ఇందుకు చికిత్సగా..వైద్యులు బేరియాట్రిక్ సర్జరీను సూచిస్తున్నారు. అయితే..దీనిపై కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. దీని గురించి ఈరోజు చూద్దాం.

- Advertisement -

ఈ తరహా సర్జరీలతో దుష్ఫలితాలు చాలా ఉంటాయని.. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తాయని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. పొట్టకు కుట్లు వేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఎముకలు బలహీనపడతాయని, కీళ్లనొప్పుల సమస్య మొదలవుతుందని, త్వరగా వృద్ధాప్యం వస్తుందని కొందరు అంటున్నారు.

ఉండాల్సిన బరువుకన్నా అధికంగా ఉన్నప్పుడు బేరియాట్రిక్‌ సర్జరీతో బరువును నియంత్రించొచ్చని ప్రముఖ ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌ బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. బేరియాట్రిక్‌ సర్జరీ వల్ల దుష్ఫలితాలు రావడం చాలా అరుదుగా కనిపిస్తాయని, ప్రాణాపాయం కూడా చాలా తక్కువేనని ఆయన అంటున్నారు. కేవలం స్వల్ప ఘటనల ఆధారంగా అపోహలు ప్రచారం కావడంతో అందరూ భయాందోళనలకు గురవుతున్నారని ఆయన వివరించారు. ఎలా అయితే కొవిడ్ టీకా మొదట్లో..జనాలు ఎలా అనుమానం వ్యక్తం చేశారో..ఈ సర్జరీపై కూడా ప్రజల్లో అలాంటి అపోహలే ఉన్నాయి. ఊబకాయంతో బాధపడుతున్నవారిని సాధారణస్థాయికి తీసుకురావడమే ఈ సర్జరీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంతో ఓ వ్యక్తి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉన్న బరువులో 25 నుంచి 35 శాతం తగ్గించొచ్చట. మరికొందరు అయితే.. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆహార పదార్థాలను తినలేమని.. తద్వారా అవసరమైన ప్రోటీన్లు, మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్స్‌ శరీరానికి అందవేమోననే కొందరు భయపడుతున్నారని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని నర్సయ్య గౌడ్‌ తెలిపారు.

ఈ జబ్బులను నియంత్రించవచ్చు..

గుండె, మూత్ర పిండాలకు చేసే.. శస్త్రచికిత్సల లాంటిదే బేరియాట్రిక్‌ సర్జరీ అని ప్రముఖ ల్యాప్రోస్కోపిక్‌ అండ్‌ బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీలక్ష్మి తెలిపారు. అయితే ఈ ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తి ఏ పరిస్థితుల్లో సర్జరీ కోసం వచ్చారనే అంశం చికిత్సలో చాలా కీలకమని ఆమె అంటున్నారు. ఊబకాయం ప్రభావంతో పలు అవయవాలు క్షీణించే దశలో ఉన్నవారికి మాత్రం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ముప్పు ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఊబకాయంతో బాధపడుతూ గుండె, ఊపిరితిత్తులు లాంటి పలు అవయవాలపై ప్రభావం పడుతోందని భావించినవారు వీలైనంత త్వరగా చికిత్స చేయించుకోవాలని ఆమె సూచిస్తున్నారు.

బేరియాట్రిక్ సర్జరీతో షుగర్‌, కొలెస్ట్రాల్‌, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక జబ్బులు నియంత్రణలోకి వస్తాయని చెబుతున్నారు.ఇంకా మంచి విషయం ఏంటంటే..ఎవరైతే అధిక బరువువల్ల.. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారో.. వారికి ఈ సర్జదీ ద్వారా బరువు తగ్గి.. గర్భం ధరించే అవకాశాలు మెరుగుపడతాయని ఆమె వివరించారు. కొందరికి.. అవయవాల మార్పడి చేయాల్సి వచ్చినప్పుడు అధిక బరువు సమస్యగా మారుతుందని తెలిపారు.

మొత్తంగా చూస్తే ఈ సర్జరీ వల్ల ఉపయోగాలే ఎక్కువ ఉన్నాయి. మీరు చేయించుకోవాలి అనుకున్నప్పుడు మంచి అనుభవజ్ఞులైన వైద్యులతోనే ఈ సర్జరీ చేయించుకోవాలి. మీరు ఏ దశలో ఉన్నారు..సర్జరీ అవసరమా కాదా అని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే సర్జీరీ చేయించుకోవాలి.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...