పొలార్డ్ షాకింగ్ నిర్ణ‌యం.. క్రికెట్‌కు రిటైర్మెంట్

-

వెస్టిండిస్ స్టార్ క్రికెటర్ కీర‌న్ పొలార్డ్ షాకింగ్ నిర్ణ‌యం నిర్ణ‌యం తీసుకున్నాడు. 34 ఏళ్ల కీర‌న్ పొలార్డ్ అంత‌ర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మెట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాట్టు ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. త‌న ట్విట్ట‌ర్ ఖాతా లో… తాను అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుక‌న్న‌ట్టు తెలిపాడు. అంద‌రి లాగే తాను కూడా 10 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌ప్ప‌టి నుంచే క్రికెట్ పై అభిమానం పెంచుకున్న‌ట్టు పేర్కొన్నాడు. వెస్టిండిస్ జాత‌యా క్రికెట్ జట్టుకు ఆడాల‌ని క‌ల‌లు క‌న్నానని తెలిపాడు.

ఆ క‌ల‌ల‌ను నిజం చేస్తు.. దాదాపు 15 ఏళ్ల పాటు వెస్టిండిస్ జాత‌యా జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హించిన‌ట్టు వివ‌రించాడు. అందులో త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అలాగే త‌నకు ఇష్ట‌మైన క్రికెట‌ర్ బ్రియ‌న్ లారా అని.. అత‌ని సారథ్యంలోనే క్రికెట్ లోకి ఎంట్రి ఇచ్చిన‌ట్టు తెలిపాడు. కాగ పొలార్డ్ ఇప్ప‌టి వ‌ర‌కు వెస్టిండిస్ ప‌రిమిత ఓవ‌ర్ల జట్టుకు కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రించాడు.

అలాగే వెస్టిండిస్ త‌ర‌పున ఇప్ప‌టి వ‌ర‌కు 123 వ‌న్డే మ్యాచ్ లు ఆడి2,706 ప‌రుగుల‌, 55 వికెట్లు తీసుకున్నాడు. 101 టీ 20 మ్యాచ్ లు ఆడి.. 1,569 ప‌రుగులు, 42 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అలాగే 184 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 3,350 ప‌రుగులు చేసి 66 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే పొలార్డ్.. ఐపీఎల్, క‌రేబియ‌న్ లీగ్ వంటి టీ 20 లీగ్ లల్లో ఆడటం పై క్లారిటీ ఇవ్వ‌లేదు.

Read more RELATED
Recommended to you

Latest news