చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనా?

-

సెకండ్‌ వేవ్‌ కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిరోజూ వివిధ లక్షణాలతో వైరస్‌ బారిన పడుతున్నారు. వైరస్‌ తన లక్షణాన్ని ఇలా పలు విధాలుగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల త్వరగా దీన్ని గుర్తించలేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా అయితే పొడిదగ్గు, నీరసం, వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు. అయితే, ఇటీవల చెస్ట్‌ పెయిన్‌ కూడా కొవిడ్‌ లక్షణమేనని వైద్యులు ధ్రువీకరించారు. దీన్ని కొంత మంది బాధితుల ద్వారా తెలుసుకున్నారు. కొద్దిపాటి చెస్ట్‌ పెయిన్‌ వచ్చినా వైరస్‌ లక్షణమేనని నిర్ధారించారు. దీనివల్ల పరిస్థితి విషమిస్తుందని అపోహ పడతారు. కానీ, కొన్ని కారణాల వల్ల కరోనా వైరస్‌ ఛాతినొప్పికి దారితీస్తుంది.

పొడిదగ్గు

కరోనా వైరస్‌ సోకిన వ్యక్తులకు పొడిదగ్గు విపరీతంగా వేధిస్తోంది. దీనివల్ల పక్కటేముకలు కూడా నొప్పి అవుతాయి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా మారుతుంది.

నిమోనియా

నిమోనియా కూడా కొవిడ్‌ లక్షణంగా నిర్ధారితమైంది. దీని వల్ల లంగ్స్‌లో ఇన్ఫెక్షన్‌ వస్తుంది. ఫలితంగా ఛాతిలో నొప్పి వస్తుంది.

లంగ్స్‌ ఇన్ఫెక్షన్‌

లంగ్స్‌లో కొద్దిపాటి మంట వచ్చినా అది ఛాతినొప్పికి దారితీస్తుంది. కరోనా రోగులు ఛాతినొప్పితో బాధపడతారు. దీని బారిన పడినవారు సీటీ స్కాన్, ఎక్స్‌రే తీసిన తర్వాత పరిస్థితిని చూసి చికిత్స అందిస్తారు.

రక్తనాళాల ద్వారా వైరస్‌ వ్యాప్తి

గడ్డకట్టుకుపోయిన రక్తం విడిపోయి లంగ్స్‌ ద్వారా పల్మనరీ ఎంబాలిజానికి వ్యాపిస్తుంది. ఫలితంగా ఛాతినొప్పి ఏర్పడుతుంది. కాలేయానికి రక్త సరఫరాను నిలిపివేస్తుంది. కరోనా వైరస్‌ వల్ల ఇది చోటు చేసుకుంటుంది. దీనివల్ల కాలేయంలో నొప్పి వస్తుంది. ఇది కొవిడ్‌ వైరస్‌ బారిన పడిన రోగుల ద్వారా వైద్యులు గుర్తించగలిగారు.

Read more RELATED
Recommended to you

Latest news