బరువు తగ్గాలనుకునే వారు కష్టపడి వ్యాయామాలు చేయడమే కాదు.. తినే ఫుడ్ మీద కూడా శ్రద్ధ ఉండాలి. నట్స్ ద్వారా కూడా బరువు తగ్గించుకోవచ్చు తెలుసా..? వాల్‌నట్స్ తింటే బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా షుగర్ పేషంట్స్‌కు కూడా ఇవి చాలా మేలు చేస్తాయట. వాల్‌నట్స్ తింటే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
వాల్‌నట్స్‌లో ఉండే గుణాలు శరీరంలో ALA అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వు కదలికను తగ్గించి.. బరువును నియంత్రించేందుకు కూడా ఇది సహాయపడుతుంది. వాల్‌నట్స్‌లో ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల పొట్ట ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కృషి చేస్తుందట…
ఈ నట్స్‌లో ఉండే మూలకాలు శరీరంలో బరువును నియంత్రించేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు- వాల్‌నట్‌లో ఇతర గింజల కంటే ఎక్కువ ఒమేగా -3 ఉంటుంది. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే మెదడు పనితీరును పెంచడంలోనూ అద్భుతంగా పనిచేస్తుంది.
రాత్రిపూట 4 లేదా 5 వాల్‌నట్‌లను నీళ్లలో నానబెట్టుకుని, ఒక కప్పు పెరుగుతో కలిపి ఉదయాన్నే తింటే మేలు చేస్తుంది. ఇంకా కావాలంటే ఈ మిశ్రమానికి ఓట్స్ కూడా జోడించవచుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దానిలో పోషకాల పరిమాణం మరింత పెరుగుతుంది. హెల్తీ టిఫెన్ అవుతుంది.
డయబెటిక్స్‌కు కూడా వాల్‌నట్స్ బాగా హెల్ప్ అవుతాయి. నానబెట్టిన వాల్ నట్స్‌ను తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ 2 నుండి 3 వాల్ నట్స్‌ను తినేవారిలో టైప్ -2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. వాల్ నట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా బాగా పనిచేస్తాయి. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌ను అధిక మొత్తంలో తీసుకున్న వారు శారీరకంగా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారట. పిజ్జాలు, బర్గర్లు కంటే వాల్‌నట్స్ కాస్ట్ ఏం ఎక్కువ కాదు. ప్రజెంట్ మనుషులు ఎలా ఉన్నారంటే.. తినే ఆహారం అంతా జంక్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. మీరు పానీపూరీలు, పిజ్జాలు, జంక్‌ఫుడ్స్ తినాలనుకుంటే తినండి..వాటితోపాటు ఆకుకూరలు, నట్స్, గింజలు కూడా తింటే బ్యాలెన్స్ అవుతుంది కదా..ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు..?