అప్పుడే పుట్టిన బిడ్డ ఏడిస్తే మంచిదేనా.. వెంటనే ముర్రుపాలు ఇవ్వొచ్చా..!

గర్భంతో ఉన్న మహిళలకు ఆ తొమ్మిది నెలలు ఎంత ప్రాముఖ్యమో…బిడ్డపుట్టిన తరువాత అంతేకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కానీ చాలామంది తెలియక కొన్ని చిన్నచిన్న తప్పులు చేస్తుంటారు. పుట్టిన బిడ్డ ఏడిస్తే..అదేదో చెడ్డవిషయం అని ఆ బిడ్డ ఏడుపు మాన్పించటానికి ట్రై చేస్తారు. కానీ అస్సలు అలా చేయకూడదట. బిడ్డ పుట్టగానే అసలు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

newborn baby cry

  • బిడ్డ పుట్టిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది బిడ్డను బాగా కడిగి వెంటనే తల్లికి అప్పగించాలి
  • బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు వ్యవధిలోనే తల్లి బిడ్డకు ముర్రుపాలు తాగించాలి
  • బిడ్డను వెచ్చటి శుభ్రమైన దుస్తులలో ఉంచి తల్లి శరీరం తగిలేలా వెచ్చగా ఉంచాలి. బిడ్డ కనుక నెలలు నిండకుండా పుట్టి వుంటే, హాస్పిటల్ సిబ్బంది బిడ్డను వేరుగా ఇన్ క్యుబరేటర్ వంటి సాధనాలలో ఉంచి ఆరోగ్యాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉంటారు.

​పుట్టగానే ఏడిస్తే..

పిల్లలు పుట్టగానే ఏడ్వడం మంచిదంటారు వైద్యులు. శిశువు ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకు వైద్యులు పిల్లలను ఏడిపిస్తుంటారు. మరోవైపు అప్పుడే పుట్టిన బిడ్డకు బయటంతా భిన్నంగా ఉంటుంది. అలా వారు జన్మించిన తరువాత కొంచెం చికాకును కలిగి ఉండవచ్చు. ఎందుకంటే వారు గర్భంలో ఉన్న వెచ్చదనాన్ని కోల్పోతారు. కాబట్టి అలా పుట్టిన వెంటనే ఏడుస్తారు. మీరు ఏం కంగారుపడాల్సిన పనిలేదు.

తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి

బిడ్డకు ముర్రుపాలు చాలా మంచిది. అంటే బిడ్డ పుట్టగానే తల్లి ఇచ్చే పాలను ముర్రుపాలు అంటారు. వీటి రంగు రుచి కాస్త తేడాగా ఉంటుంది. అలా అని కొందరు బిడ్డకు పట్టించరు. కానీ ఆ ముర్రుపాలలో చాలా పోషకాలు ఉంటాయి. బిడ్డకు వాటిని పట్టించటం వలన ఎన్నోరకాలు అనారోగ్య సమస్యల నుంచి బిడ్డను కాపాడినట్లే. అంతేకాదు మొదటి ఆరునెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు బొడ్డుతాడు పచ్చిగా ఉంటుంది. బొడ్డుతాడు కట్ చేసిన తరువాత.. బొడ్డు ఎండిపోయి దానంతట అది ఊడిపోయే వరకు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల విషయంలో పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. పరిశుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

– Triveni Buskarowthu