ఎండాకాలంలో చల్లనీటి స్నానం మంచిదేనా?

అసలే వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి.దీంతో ప్రజలు ఎంతో అసౌకర్యానికి గురవుతున్నారు. ఒక్కోసారి ఇంత వేడి, ఎండ ప్రాణాంతకమవుతాయి కూడా. దేశం మొత్తం విలయతాండవం సృష్టిస్తోంది. ఈ తరుణంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వేడి గాలుల వల్ల ఇంకొక సమస్య కూడా ఎదురవుతుంది. దీనివల్ల కార్డియో వాస్క్యులర్‌ డిస్ట్రెస్, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు వస్తాయి.

 

ఎండ బాగా ఎక్కువగా ఉంటే హీట్‌ స్ట్రోక్‌ కూడా రావచ్చు. హీట్‌ స్ట్రోక్‌ అంటే వాతావరణంలో వేడి వల్ల బాడీ టెంపరేచర్‌ 104 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ దాటి ఉండడం. హీట్‌ వేవ్స్‌ వల్ల కంఫ్యూజన్, తలనొప్పి, వికారం, డిజ్జీనెస్‌ వంటివి ఉంటాయి. ఈ సమస్యకి తక్షణం వైద్య సహాయం అందకపోతే అది మరణానికి దారితీస్తుంది.

  • బయటకి వెళ్లినప్పుడు మీతో పాటు బాటిల్లో నీరు కూడా తీసుకెళ్లండి. వేడిని తట్టుకోవడానికి ఎక్కువగా నీరు తాగడం, ఫ్రెష్‌ ఫ్రూట్‌ జ్యూసులు తీసుకోవడం వంటివి చేయాలి. కొబ్బరి నీరు, చెరుకు రసం కూడా ఎంతో మంచివి. వీలైతే మీ తోపాటు గ్లూకోజ్‌ నీరు తీసుకుని వెళ్లడం కూడా మంచి పని. ఆల్కహాల్‌కి దూరంగా ఉండండి, కాఫీ, టీ వంటి వేడి పానియాలకు దూరంగా ఉండడం మంచిది.
  • మామిడి పండ్లు, పుచ్చకాయలు, కీరా, ఆకుకూరలు మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి. అంతేకాదు మన శరీరానికి అవసరమైన విటమిన్స్‌, మినరల్స్‌ కూడా ఇస్తాయి.
  • అలాగే బయటకి వెళ్లినప్పుడల్లా మీతో పాటూ ఒక గొడుగు తీసుకు వెళ్లండి.
  • శరీర ఉష్ణోగ్రతను తగ్గిండానికి ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయాలి. మరీ చల్లని నీరు కాకుండా కొద్దిగా గోరు వెచ్చగా ఉన్న నీటితో స్నానం చేయడం మంచిది.
  • మీకు బాలేకపోతే మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్‌ లో వైద్య సహాయం పొందండి. మీకు సహాయం అవసరమయినప్పుడు ఎవరికి కాల్‌ చేయాలో తెలుసుకుని ఉండండి.
  • మీకేవైనా మెడికల్‌ కండిషన్స్‌ ఉంటే మీ డాక్టర్‌ సూచనలని ఫాలో అవ్వండి.
  • మధ్యాహ్నం పూట బయటకి వెళ్లకండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. కాటన్‌ బట్టలకు ప్రిఫరెన్స్‌ ఇవ్వండి.