ఈటెల రాజేందర్ పై ప్రారంభమైన విచారణ… మంత్రి పదవికి రాజీనామా చేస్తారా…?

తెలంగాణలో మంత్రి ఈటెల రాజేంద్రకు సంబంధించిన వ్యవహారాలపై ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం గట్టిగా దృష్టిపెట్టింది. గత కొన్ని రోజులుగా ఈటెల రాజేంద్ర టిఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా వెళుతున్నారని సీఎం కేసీఆర్ ను ధిక్కరించే ప్రయత్నం చేస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీలో తన వర్గానికి కూడా ఈటెల రాజేందర్ దూరమయ్యారని… ఆయనతో ముందు నుంచే సన్నిహితంగా ఉన్న వాళ్ళుకూడా ఈ మధ్య కాలంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదని మీడియా వర్గాల్లో ప్రచారం ఉంది.

health minister etala rajender speaks about covid condition in telangana

ఈ నేపథ్యంలో తాజాగా ఈటెల రాజేందర్ కు సంబంధించిన వ్యవహారాలు టిఆర్ఎస్ పార్టీ అనుకూల మీడియా లో కూడా రావడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కాలేదు. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ కు సంబంధించి విచారణ మొదలైంది. అచ్చంపేట గ్రామంలో వంద ఎకరాలను ఆయన కబ్జా చేశారు అని ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు విజిలెన్స్ అధికారులు విచారణ కు వెళ్లారు. సీఎం కేసీఆర్ విచారణ ఆదేశించిన నేపథ్యంలో కాసేపటి క్రితం అధికారులందరూ అచ్చంపేట గ్రామానికి చేరుకోగా భారీగా పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

ఇక గ్రామంలో ఉన్న రైతులను గ్రామస్తులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరి భూమిలో కబ్జా జరిగింది ఎవరి పేరున రిజిస్టర్ అయింది అనేదానిని ఆరా తీస్తున్నామని నిజానిజాలు బయటపెడతామని అచ్చంపేట ఎమ్మార్వో స్పష్టం చేశారు. దాదాపుగా 30 మంది అధికారులు విచారణకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనితో ఈటెల రాజేందర్ పై ఒత్తిడి పెరుగుతుందని ఆయన టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలు… అలాగే మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉండవచ్చునని అంటున్నారు.