వెన్నునొప్పి మరీ భాదిస్తుందా..? అయితే ఇలా చేసేయండి..!

-

వెన్ను నొప్పి.. ఇది పెట్టే బాధ మాములుగా ఉండదు.. కుర్చోలేం, పడుకోలేం..ఎప్పుడూ ఎవరైనా మసాజ్‌ చేస్తే బాగుండురా అనిపిస్తుంది. బాగా బరువులు ఎత్తినప్పుడో, ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో కుర్చున్నప్పుడే ఇలా జరుగుతుంది. వెన్నునొప్పితో బాధపడుతుంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.. అవేంటంటే..

వెన్ను సమస్యల నుంచి మనం బయటపడడానికి మన కండరాలు ఎప్పటికప్పుడు సాగదీస్తూ లేదా మసాజ్ చేస్తూ ఉండాలి.

ఒకేసారి బరువులు పైకి ఎత్తేముందు మన శరీరానికి కొన్ని ఎక్సర్సైజులు అలవాటు చేయాలి. చిన్న చిన్న ఎక్సర్ సైజ్ శరీరానికి అలవాటు పడిన తరువాత మాత్రమే బరువులు ఎత్తడం వంటివి చేయాలి. దాని వల్ల కండరాలు కూడా వ్యాయామం అవుతుంది.

ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ప్రభావం ముఖ్యంగా మెడనొప్పి, భుజాలు, వెన్ను నొప్పి వెంటాడుతుంది.
శరీరానికి తగిన విశ్రాంతి అందించండి. దీని వల్ల కండరాలన్నీ కొత్త ఉత్తేజం పొందుతాయి.

నిద్రను నిర్లక్ష్యం చెయ్యకండి. రోజుకు 7 నుండి 8గంటలు నిద్రకు కేటాయించండి.
ఒకే చోట వెన్ను కిందకు వాల్చి ఎక్కువ సేపు కూర్చోకూడదు, వంగకూడదు. దీనివల్ల వెన్నుపూసల్లో గ్యాప్ వచ్చి అవి వెన్ను నొప్పి వస్తుంది.

ఆఫీస్‌లో గాని ఇంటి వద్ద కాని పనిచేసే సమయంలో వెన్ను నిటారుగా పెట్టి పనిచేసుకూవాలి. మధ్యమధ్యలో ఒక సారి నిటారుగా లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవాలి దీనితో వెన్నుముఖ పై అదిక ప్రభావం పడకుండా ఉంటుంది.

శరీరాన్ని ఎప్పుడూ దృడంగా గా ఉంచుకోవాలంటే పండ్లు ,కూరగాయలు తింటూ ఉండాలి.
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

మనం రోజూ తినే భోజనం కూడా ఒక డైట్ ప్రకారం తీసుకోవాలి. దాని వల్ల మన శరీరం ఫిట్‌గా ఉంటుంది.
వ్యాయామానికి టైమ్ కేటాయించండి.

ఈ జాగ్రత్తలతో పాటు.. ఎముకలు బలంగా ఉండేందుకు సరిపోయే ఆహారాలు తీసుకోండి. నొప్పి బాగా ఎక్కువగా ఉంటే.. ఆవ నూనెను లైట్‌గా వేడి చేసి అందులో ముద్ద కర్పూరం వేయండి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఎవరితోనైనా నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్‌ చేయించుకోండి. అలా బాగా మసాజ్ చేసిన తర్వాత..వేడినీళ్లతో కాపడం పెట్టించుకోండి. అంతే ఈ ప్రాసెస్‌ అయిపోయే సరికి నొప్పి కూడా తగ్గుతుంది. అయితే ఇలా ఒక్కరోజు చేస్తే లాభం ఉండదు. వారానికి రెండు మూడు సార్లు.. నొప్పిగా ఎక్కువగా ఉంటే రోజు చేసిన పర్వాలేదు. దీని వల్ల ఉపశమనం అయితే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news