ఎర్రబెల్లి దయాకర్ రావు ఫాల్తూ మినిస్టర్ – ఎమ్మెల్యే రాజాసింగ్

-

జనగామ జిల్లా దేవరూప్పులలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బిజెపి నాయకుల పై టీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బండి సంజయ్ పైన చేతగాని టిఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేసారని విమర్శించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఫాల్తు మినిస్టర్.. ఆయనకు ఏమి రావని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

” టిఆర్ఎస్ కార్యకర్తలు కుట్ర చేస్తే ఆగము. మీ లాంటి కుక్కల్ని పక్కకు జరిపి బండి సంజయ్ బండి ముందుకు సాగుతుంది. బీర్లు తాగించి ఎటాక్ చేయించారు. దాడి జరుగుతుందని పోలీస్ లకు ముందే తెలుసు…పోలీస్ లు ఇన్వాల్వ్ అయ్యారు. టిఆర్ఎస్ ఉండేది ఇంకా ఒక సంవత్సరం మాత్రమే. బిజెపి ప్రభుత్వం వచ్చాక మీ పరిస్థితి ఏందో పోలీసులు ఆలోచించుకోవాలి.

టిఆర్ఎస్ కుక్కలకు చెబుతున్నా రాజకీయం ఒక పద్దతిలో చేయండి. మేము తల్చుకుంటే మీ వాళ్ళు బయట తిరుగుతారా. మా కార్యకర్తలు తిప్పి తిప్పి కొడతారు. ఈ దాడిలో ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలి”. అంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Latest news