టీ తాగే అలవాటు లేకపోయినా ఈ “నిమ్మ టీ” రుచి తెలుసుకోండి.. దాని ప్రయోజనాలు గుర్తుంచుకోండి.

-

భారతదేశంలో టీ తాగేవారి సంఖ్య చాలా ఎక్కువ. పొద్దున్న లేవగానే కడుపులో ఛాయ్ పడందే మరో పని చేయలేని వారు చాలామంది. టీలో కూడా ఎన్నో రకాలున్నాయి. అల్లం టీ, నిమ్మ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ దేనికదే ప్రత్యేకం. ఒక్కోదానిలో ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అలాంటిదే నిమ్మ టీ కూడా. బ్లాక్ టీలో నిమ్మరసం పిండితే తయారయ్యే నిమ్మ టీ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. టీ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా ఈ నిమ్మ టీ ప్రయోజనాలు తెలుసుకున్నాక అప్పుడప్పుడు తాగవచ్చు.

రోగనిరోధక శక్తి పెంచడానికి

నిమ్మకాయలో విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. అలెర్జీలు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షించి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయపడతాయి.

చర్మ సంరక్షణ

మొటిమలు, మచ్చలు మొదలైన చర్మ సంబంధ ఇబ్బందులను నిమ్మ టీ దూరం చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడంతో చర్మానికి బాగా మేలు కలుగుతుంది.

బరువు తగ్గించడానికి

జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పర్చి బరువు తగ్గడంలో నిమ్మ టీ ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలన్న ఆలోచనలో మీరున్నట్లయిటే మీ డైట్ లో నిమ్మ టీని చేర్చుకోండి.

ఒత్తిడి తగ్గిస్తుంది.

ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, రాగి ఇంకా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటివల్ల అనవసరమైన ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఎక్కువ విశ్రాంతి అందుతుంది కాబట్టి మానసిక పరిస్థితి బాగుంటుంది.

జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది

దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news