బాడీలో కొలెస్ట్రాల్ ఉండాలి కానీ అది మంచిదై ఉండాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం. గుండెకు ఇంకా డేంజర్.. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఎంతోమంది హార్ట్ఎటాక్తో ప్రాణాలు కోల్పోతున్నారు. మరీ ఈ చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేయాలంటే.. మనం చేయాల్సిందల్లా దాన్ని తరిమికొట్టే ఆహారాలాను లోపలికి పంపించడమే.. శత్రువు బయట ఉంటే ఏదో ఒకలా వాడిపై దండయాత్ర చేస్తాం..కానీ మనలోనే ఉంటే..లోపలికి వెళ్లే వాటి ద్వారానే ఏదైనా చేయగలం.. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే ఆహారాలు చాలా ఉన్నాయి.. వాటిల్లో చీప్ అండ్ బెస్ట్‌లో వచ్చేది బెండకాయ. ఈ కూరగాయ తింటే లెక్కలు వస్తాయని చిన్నప్పుడు తెగ చెప్పేవాళ్లు.. లెక్కలు ఏమోగానీ.. ఇది తింటే చెడు కొలెస్ట్రాల్ తిక్క అయితే కుదురుతుంది. దెబ్బకి దుకాణం ఖాళీ చేయాల్సిందే..!
బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కాకుండా పెక్టిన్ కూడా ఇందులో కనిపిస్తుంది. దీని సహాయంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీని వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
డయబెటీస్‌కు కూడా బెండకాయ బాగా పనిచేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రిస్తుంది. కడుపు సమస్యలను తొలగిస్తుంది. జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు.
బెండకాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈరోజుల్లో రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిందే. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బెండకాయ బాగా ఉపయోగపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు కూడా వారి డైట్లో బెండకాయ చేర్చుకోవడం చాలా ఉత్తమం. అయితే బెండకాయతో పులుసు చేసుకుని తినడం వల్ల పెద్ద లాభం ఉండదు. లేత బెండకాయలతో ఉప్పు, నూనెలు లేకుండా వండుకుంటే..అందులో జిగురు శాతం అలాగే ఉంటుంది.
కాబట్టి.. మధుమేహం బాధపడేవారు, అధిక బరువు ఉన్నవారు ఎక్కువగా బెండకాయ తింటే అన్ని విధాల మేలు జరుగుతుంది.