ఈ ఐదు అలవాట్లు అలవర్చుకుంటే మీ జీవితం సరైన దిశలో వెళ్తుంది…

మనం రోజూ చేసే పనులే మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మన పనులు సరైన మార్గంలో ఉంటే, గమ్యం వైపు తొందరగా చేరుకుంటాం. లేదంటే అందని ద్రాక్షలా ఎప్పటికీ అందకుండా పోతుంది. ఐతే గమ్యాన్ని తొందరగా చేరుకోవడానికి కొన్ని అవసరమైన అలవాట్లని అలవర్చుకోవాల్సి ఉంటుంది. అటువంటి అలవాట్లలో అత్యవసరమైనవి ఏంటో తెలుసుకుందాం.

పొద్దున్నే నిద్రలేవడం

ఇది చాలా మందికి కష్టమైన పని. రాత్రుళ్ళు ఆలస్యంగా నిద్రపోయి ఉదయం పూట ఆలస్యంగా నిద్రలేస్తారు. కానీ అలా కాకుండా ఉదయం తొందరగా లేస్తే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అందువల్ల అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయగలుగుతారు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా పొద్దున్న పూట తొందరగా మేల్కోవడం అలవాటు చేసుకోండి. ఫలితం మీకే అర్థం అవుతుంది.

దినచర్య

పొద్దున్న లేవగానే ఆరోజు ఏం చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకోండి. దానివల్ల ఆ రోజులో ఏం చేయాలనేది ముందే తెలిసిపోతుంది కాబట్టి, ఏం చేయాలనే ఆలోచన అవసరం ఉండదు.

వ్యాయామం

ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చాలా అవసరం. ఇప్పుడు బాగున్నాను కదా అని అనుకోకుండా రేపు కూడా బాగుండాలన్నా ఉద్దేశ్యంతో వ్యాయామం చేయండి.

పుస్తకాలు చదవాలి

పుస్తకం మస్తకానికి మంచి మిత్రుడు అంటారు. పుస్తకాలు చదవడం వల్ల ఊహా శక్తి పెరుగుతుంది. మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకువెళ్లే పుస్తకాలు చదవండి.

నిద్ర

రోజులో కనీసం ఆరు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. సరైన నిద్ర ఉంటేనే సరిగ్గా ఆలోచించగలుగుతారు. అందుకే కావాల్సినంత సేపు నిద్రపోతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు.