లాంగ్‌ కోవిడ్‌ ఎఫెక్ట్.. పది నిమిషాలు నిలబడితే నీలం రంగులోకి మారుతున్న రోగులు

-

కరోనా కేసులు తగ్గాయి.. ఎక్కడో ఒకటి అరా నమోదవుతున్నాయి. కానీ కాలం చేసిన గాయం మాత్రం మారలేదు. వాటి వల్ల దెబ్బతిన్న కుటుంబాలు, పోయిన ఉద్యోగాలు, లాస్‌ అయిన వ్యాపారాలు ఇలా చాలా ఉన్నాయి. అయితే కరోనా సోకని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారేమో కదా..! మూడు దశల్లో ఏదో ఒక దశలో జనాలు ఎఫెక్ట్‌ అయ్యారు. దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడిన వాళ్ళు 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత వారి కాళ్ళు నీలం రంగులోకి మారడం గుర్తించినట్టు తాజా నివేదిక వెల్లడిస్తుంది. లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Lunch Covid
Lunch Covid

పది నిమిషాలు నిలబడితే రంగు మారిన కాళ్లు..

33 ఏళ్ల వ్యక్తి కాళ్ళ సిరల్లో రక్తం చేరడాన్ని సూచించే ఆక్రోసైనోసిస్ అనే పరిస్థితిని అభివృద్ధి చేసిన విషయాన్ని ఈ అధ్యయనం తెలిపింది. దీర్ఘకాలం పాటు కోవిడ్ బారిన పడిన వ్యక్తి కాసేపు నిలబడితే అతని కాళ్ళు ఎర్రబడటం మొదలయ్యాయట. కాలక్రమేణా అది నీలం రంగులోకి మారాయని యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అధ్యయనం వెల్లడించింది. 10 నిమిషాల పాటు నిలబడిన తర్వాత మారిన రంగు మరింత స్పష్టంగా కనిపించింది. అంతే కాదు రోగి కాళ్ళలో భయంకరమైన దురద కూడా వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాన్ స్టాండింగ్ పొజిషన్ తిరిగి ప్రారంభించిన రెండు నిమిషాల తర్వాత రోగి కాళ్ళు మళ్ళీ సాధారణ రంగులోకి తిరిగి మారిపోయాయి.

కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకకముందు సదరు రోగిలో ఇలా ఎప్పుడూ జరగలేదు. ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఆక్రోసైనోసిస్ రావడం మాత్రం ఆశ్చర్యం కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. రోగికి పోస్చురల్ ఆర్థోస్టాటిక్ టాచీకార్డియా సిండ్రోమ్ (POTS) ఉన్నట్లు నిర్ధారణ అయింది. నిలబడి ఉన్నప్పుడు హృదయ స్పందన రేటు అసాధారణంగా పెరుగుతుంది.

లాంగ్‌ కోవిడ్‌ ఎఫెక్ట్‌..

లాంగ్ కోవిడ్ వల్ల హృదయ స్పందన రేటు, రక్తపోటు, శ్వాసక్రియ, జీర్ణక్రియ, లైంగిక శక్తి వంటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే స్వయం ప్రతిపత్త నాడీ వ్యవస్థతో సహా శరీరంలోని పలు వ్యవస్థలని ప్రభావితం చేస్తుందని అధ్యయనంలో తేలింది. దీన్ని ఎదుర్కొంటున్న రోగులకు కూడా ఇది దీర్ఘకాలిక కోవిడ్ వల్ల వచ్చిన లక్షణమని తెలియకపోవచ్చు. అదే విధంగా ఆక్రోసైనోసిస్, లాంగ్ కోవిడ్ మధ్య ఉన్న లింకు గురించి కూడా కొంతమంది వైద్యులకు తెలియకపోవచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ పేర్కొన్నారు.

క్యాన్సర్‌ కంటే దారుణం..

లాంగ్ కోవిడ్ ఉన్న వారిలో డైసోటోనోమియా, POTS రెండూ అభివృద్ధి చెందుతాయని తేలింది. ఈ రెండూ పరిస్థితులు కండరాలని ప్రభావితం చేస్తాయి. నొప్పిని కలిగిస్తాయి. ఈ పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యక్తులలో దీని గురించి తప్పనిసరిగా అవగాహన కల్పించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అప్పుడే రోగులకి తగిన విధంగా వైద్యపరమైన సహాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. లాంగ్ కోవిడ్ కారణంగా అలసట, డిప్రెషన్, ఆందోళన, బ్రెయిన్ ఫాగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది రోగుల రోజువారీ కార్యకలాపాలపై ఎఫెక్ట్‌ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి క్యాన్సర్ రోగుల కంటే దారుణంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏది ఏమైనా కొవిడ్‌ భారిన పడినవాళ్లు ఎప్పటికీ ఆరోగ్యంపై రెట్టింపు జాగ్రత్తగా మెలగాలి.

Read more RELATED
Recommended to you

Latest news