జీవనశైలిలో మార్పులు చేస్తే ఊబకాయం, వంధ్యత్వానికి గురైన మహిళల్లో సంతానోత్పత్తిని పెంచచ్చు …!

-

నిపుణులు మనకి కొన్ని విషయాలను తెలియజేశారు. ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ ని మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ముఖ్యంగా ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ తో పోలిస్తే ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం వలన ప్రెగ్నెన్సీ రేట్ ని పెంచొచ్చు అని అంటున్నారు. అలానే లైవ్ బర్త్ రేట్ ని కూడా మెరుగుపరచ వచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

చాలా మంది మహిళలు ఊబకాయం సమస్య తో సతమతమవుతూ ఉంటారు. జీవన శైలి మార్పులు మరియు మహిళలు బరువు లో 10 నుంచి 5 శాతం తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ లో ఇబ్బందులు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు. ఈ రీసెర్చ్ లో 130 మంది మహిళలను గమనించడం జరిగింది.

ఫెర్టిలిటీ క్లినిక్ లో 130 మంది మహిళలకి ట్రీట్మెంట్ ఇవ్వగా… వాళ్లని రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ లో ఫిట్ ఫర్టిలిటీ లో అవకాశం కల్పించారు. అయితే 6 నెలల తర్వాత గర్భం జరగకపోతే వారికి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు.

పన్నెండు గ్రూప్ సెషన్స్ ని ఒక్కక్కళ్ళకి ఇచ్చారు. అయితే ప్రతి రోజూ 45 నిమిషాల పాటు వర్క్ షాప్ ని కూడా నిర్వహించారు. దీనిలో న్యూట్రిషన్, లైఫ్ స్టైల్ మార్పులు, లైఫ్ స్టైల్ అలవాట్లు మొదలైన వాటి పై వర్క్ షాప్ ని జరిపారు.

అలానే ఫిజికల్ యాక్టివిటీస్ అయిన వాకింగ్, ట్రైనింగ్ మొదలైన వాటిని కూడా నిర్వహించారు. ఇది ఇలా ఉంటే రెండవ గ్రూప్ లో కేవలం ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ మాత్రమే ఇచ్చారు. కానీ వీళ్ళకి ఎఫ్ఎఫ్ఎఫ్ ప్రోగ్రాం ని ఇవ్వలేదు. 108 మంది మహిళల్లో 14.2 శాతం తేడాని గమనించారు. ఎఫ్‌ఎఫ్‌ఎఫ్ ప్రోగ్రాం ప్రత్యక్ష జనన రేటులో 14.2 శాతం పాయింట్ల వ్యత్యాసాన్ని సృష్టించింది. ఆకస్మిక గర్భధారణ రేటు చికిత్స సమూహంలో 33.3 శాతం, మరొక గ్రూపు తో పోల్చితే 12.3 శాతం వుంది.

Read more RELATED
Recommended to you

Latest news