కేసీఆర్ నిర్ణయం జగన్ పై ఒత్తిడి పెంచుతుందా…?

-

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీనిపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి జగన్ పై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉండవచ్చు అని తెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఇప్పుడు ఉద్యోగులకు అనుకూలంగానే ఉన్నా ఆయన వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది అర్థం కావటంలేదు.

ప్రస్తుతం ఉద్యోగులు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించే విషయంలో జగన్ దృష్టి పెడతారా లేదా అనేది స్పష్టత రావడం లేదు. అయితే తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే నెరవేర్చాల్సి అవసరం ఉంది. మరి ఈ విషయంలో జగన్ ఎటువంటి అడుగు వేస్తారు అని చూడాలి.

అయితే ఇప్పుడు వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో నిర్ణయం వారికి అనుకూలంగా తీసుకోకపోతే మాత్రం ఉద్యోగులు నిరసన దీక్షలు చేసే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం జరుగుతుంది. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే ఉద్యోగులతో చర్చలు జరుపుతున్నారని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కూడా జగన్ కొన్నికొన్ని హామీలను నిలబెట్టుకోని వలసిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. సిపిఎస్ రద్దు విషయంలో జగన్ ముందుకు వెళ్లాలని ఉద్యోగులు కోరుతున్నారు,

Read more RELATED
Recommended to you

Latest news