ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మంత్రులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో కొన్ని కొన్ని శాఖల్లో ఆదాయం రావడం లేదు. 3, 4 శాఖల్లో ఆదాయం తగ్గడంతో జగన్ కూడా ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెంచిన సరే కొన్ని శాఖలలో ఆదాయం రాకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతుంది. అందుకే ఇప్పుడు కొన్ని కొన్ని శాఖల అధికారుల పనితీరు విషయంలో జగన్ సమీక్ష చేస్తున్నారు.
ఇక మంత్రులకు కొన్నికొన్ని శాఖలను మార్చే ఆలోచనలో కూడా జగన్ ఉన్నట్టుగా సమాచారం. జలవనరుల శాఖ, ఆర్థిక శాఖ, సహా పర్యాటక శాఖలలో ముఖ్యమంత్రి జగన్ మార్పులు చేసే అవకాశాలు ఉండవచ్చని వైసిపి వర్గాలు అంటున్నాయి. వీరి విషయంలో సమీక్ష చేసిన జగన్ సంతృప్తిగా లేరని ఇక ఆయా శాఖల అధికారులు కూడా మంత్రులకు పెద్దగా సహకరించడం లేదు అని జగన్ భావిస్తున్నారు.
అందుకే ఆయా శాఖల్లో మార్పులు చేసేందుకు జగన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే జాగ్రత్తగా జగన్ చర్యలకు దిగుతున్నారు. సమర్థవంతంగా పనిచేసే మంత్రులకు మరికొన్ని శాఖలను కూడా అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కి అలాగే పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కొన్ని శాఖలను అదనంగా అప్పగించే అవకాశం ఉంది.