Morning sickness: ఈ ఇంటి చిట్కాలతో గర్భిణీల్లో ఆ సమస్య దూరం..!

-

Pregnant women: గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఏదో ఒక సమస్య ప్రతి నెలలో ఉంటూనే ఉంటుంది. ఒక బిడ్డకి జన్మనివ్వడం అంత ఈజీ కాదు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా గర్భిణీలకు వికారం, వాంతులు వంటివి వస్తూ ఉంటాయి. సమ్మర్ లో అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి వాటర్ ని ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. డిహైడ్రేషన్ వంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. మార్నింగ్  సిక్నెస్ ఉండే వాళ్లు ఆ సమస్య నుండి బయట పడడానికి ఈ చిన్న చిన్న ట్రిక్స్ ని ట్రై చేస్తే సరిపోతుంది. ఉదయం లేచిన వెంటనే మార్నింగ్ సిక్నెస్ ఉండకూడదంటే ఉదయాన్నే లేచిన వెంటనే ఒక రస్క్ తీసుకోవాలి.

pregnant women
pregnant women

లేవగానే ఐదు నిమిషాలు మంచం మీద కూర్చుని బిస్కెట్ క్రాకర్స్ లేదంటే రస్క్ ని తీసుకోవాలి. ఆ తర్వాత ఐదు నిమిషాలు ఆగి బ్రష్ చేయాలి ఇలా చేయడం వలన ఎసిడిటీ తగ్గుతుంది. లడ్డు తిన్నా కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కాళీ కడుపు తో ఉదయం లేచిన వెంటనే టీ కాఫీ ని తీసుకోవద్దు. కాళీ కడుపుతో టీ కాఫీ ని తీసుకుంటే యాసిడ్ ఫామ్ అయ్యి గుండెలో మంట మార్నింగ్ సిగ్నల్స్ వంటివి ఎక్కువ అవుతాయి.

బ్రేక్ఫాస్ట్ తో పాటు టీ కాఫీ ని తీసుకోవచ్చు. అల్లం టీ లేకపోతే పచ్చి అల్లం నమ్మితే కూడా మార్నింగ్ సిక్నెస్ తగ్గుతుంది అలానే గర్భిణీలు ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోవడం కుదరదు కాబట్టి ఆహారాన్ని డివైడ్ చేసి రెండు మూడు సార్లు తీసుకోండి. స్పైసి ఫుడ్ ని అస్సలు తీసుకోకండి. ఇలాంటివి తీసుకుంటే వికారం వాంతులు సమస్య మరింత ఎక్కువైపోతుంది. ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండండి తిన్న తర్వాత లైట్ గా పది నిమిషాల పాటు నడుస్తూ ఉండండి అప్పుడు బ్లోటింగ్ సమస్య ఉండదు. గర్భిణీలు నిద్రపోయే ముందు బ్రష్ చేయడం వలన పంటి సమస్యలు రావు.

Read more RELATED
Recommended to you

Latest news