బ్రష్ కి బదులుగా వేపపుల్ల వాడడం మంచిదా..?

-

పూర్వ కాలంలో అందరూ కూడా వేప పుల్లలతో పళ్ళు తోముకునే వారు. కానీ ఇప్పుడు టూత్ బ్రష్లు వచ్చాక వేప పుల్లలు వాడడం మానేశారు. నిజంగా చెప్పాలంటే వేపలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. దీనితో పళ్ళు తోముకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వేప వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ మనం పొందొచ్చు. దంతాలు ఆరోగ్యంగా కూడా ఉంటాయి. వేప పుల్లలు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం ..!

బ్యాక్టీరియా నుండి ప్రొటెక్ట్ చేస్తుంది:

వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల క్రిముల నుండి అది ప్రొటెక్ట్ చేస్తుంది. దానిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మరియు యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి.

ఆల్కలైన్ లెవెన్ మెయింటెన్ చేస్తుంది:

సలైవ లో ఉండే ఆల్కలైన్ లెవల్స్ ని అది మెయింటెన్ చేస్తుంది. దంతాలని బలంగా ఉంచుతుంది. వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల పంటి నొప్పులు వంటివి రావు. అదే విధంగా దంతాలని స్ట్రాంగ్ గా ఉంచుతుంది.

పళ్ళు తెల్లబడడం:

వేప పుల్లల తో పళ్ళు తోముకోవడం వల్ల పళ్ళు తెల్లగా ఉంటాయి. పంటి గార వంటివి ఇది సులువుగా తొలగిస్తుంది.

దుర్వాసన ఉండదు:

వేప పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా వేప పుల్ల వల్ల అనేక రకాల బెనిఫిట్స్ పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version