పచ్చబొట్టు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

Join Our COmmunity

పచ్చబొట్టును ఇష్టపడని వారుండరూ.. నేచర్ లవర్ అయినా, ఇష్టమైన మనిషి తన ప్రేమను చాటి చెప్పాలన్న పచ్చబొట్టు పొడిపించుకుని చూపించేస్తుంటారు. అభిమానం.. ఆవేశం.. ప్యాషన్ ఇలా అన్నింటిలోనూ భావవ్యక్తీరణకు ఇదే మంచి మార్గమని భావిస్తుంటారు కొందరు. కానీ ఆవేశం, ఇష్టంతో తీసుకున్న నిర్ణయంతో టాటూ కలకాలం మాయంకాని మచ్చలా మారిపోతుంది. అందుకే టాటూ వేసుకోవాలని అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

జాగ్రత్తలు ఇవే..
1. మద్యం సేవించినప్పుడు ఎప్పుడూ పచ్చబొట్టు పొడిపించకూడదు. హ్యాంగోవర్ లో ఉన్నప్పుడు, మద్యం తాగినప్పుడు మన రక్తం పలచబడుతుంది. ఈ సమయంలో టాటూ వేసుకుంటే చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. టాటూలు వేసుకున్నప్పుడు శరీరంపై గాయాలు అయ్యే ప్రమాదం ఎక్కువ. అవి త్వరగా మానవు కూడా.. అందుకే టాటూ వేయించుకునే 24 గంటల ముందు వరకు మద్యం సేవించవద్దు.

2.టాటూ వేయించుకునేటప్పుడు ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఆరోగ్య పరమైన దుష్ప్రభావాలు చూపుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. టాటూ వేసుకునే సమయంలో కచ్చితంగా అల్పాహారమైనా భుజించి ఉండాలి.

3. ఒక్కసారి పచ్చబొట్టు వేసుకున్న తర్వాత చెరిపేయడం చాలా కష్టం. అందుకే మీరు పచ్చబొట్టు వేసుకునే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకోవాలని అనుకున్నప్పుడు స్పెల్లింగ్, గ్రామర్ తప్పుల్లేకుండా చూసుకోవాలి. ఎలాంటి డిజైన్ కావాలో ముందే తేల్చుకోవాలి. టాటూ ఆర్టిస్టుల సలహా తీసుకున్నా తప్పేం లేదు.

4.పచ్చబొట్టు పొడిపించుకోవాలని అనుకోవాలనుకున్నప్పుడు చర్మంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మాయిశ్చరైజేషన్ చేసుకోవాలి. ఆ ప్రాంతాల్లో వేసుకోవాలి అనుకుంటే.. వెంట్రుకలు తొలగించాలి. సన్ స్క్రీన్ లోషన్ వాడుతుంటే నొప్పి నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.

5.ఎముకలు ఉన్న చోట టాటూలను అస్సలు వేసుకోవద్దు. టాటూ ఎక్కువ కాలం నిలిచి ఉండకపోవడంతోపాటు నొప్పి కూడా అధికంగా ఉంటుంది. నాభి, కండరాలు ఉన్నచోట పచ్చబొట్టు వేసుకుంటే అందంగా కనిపిస్తుంది.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news