జామ ఆకు కషాయంతో పిరియడ్స్ పెయిన్స్ తగ్గించవచ్చని చెప్తున్న పరిశోధనలు

-

స్త్రీలకు బుుతుక్రమం టైం అయిందంటే.. గజగజలాడిపోతారు. వారికి ఆ పెయిన్ ఆ రేంజ్ లో ఉంటుంది. ఆ నాలుగు రోజులు త్వరగా గడిచిపోతే చాలురా నాయనా అనుకుంటారు. ఇక ఈ నొప్పిని తగ్గేందుకు పెయిన్ కిల్లర్స్ పిప్పరమెంట్స్ మింగినట్లు మింగేస్తారు. చాలామంది.. పిల్లలు పుట్టిన తర్వాత గర్భాశయం తొలగించుకుంటారు. ఏదైన సమస్య వల్ల ఇలా చేసుకుంటే తప్పులేదు కానీ.. కావాలని గర్భాశయం తొలగించుకోవడం అంటే.. చాలా అనారోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే. నెలనెల పిరియడ్స్ అయ్యే మహిళలకు.. కానీ మహిళలకు వారి ఆరోగ్యంలో బోలెడు తేడాలు ఉంటాయి. పిరియడ్స్ కానీ వారు బరువు కూడా త్వరగా పెరుగుతారు. ఈరోజు మనం పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి నాచురల్ మార్గాలను చూద్దాం. ఇప్పటికే ఈ విషయంలో చాలా చిట్కాలను తెలుసుకున్నాం. ఇది కూడా ఓ సారి ట్రై చేసి చూడండి.
పీరియడ్స్ పెయిన్స్ తగ్గించడానికి జామఆకు కషాయం అనేది అద్భుతంగా పనికొస్తుంది. యూట్రస్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తున్నది సైంటిఫిక్ గా పరిశోధన చేసి నిరూపించారు. 2006వ సంవత్సరంలో మెక్సికన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ( Mexican Institute Of Social Security- Mexico) వారు జామఆకు మీద పరిశోధన చేశారు.
జామఆకులను తీసుకుని గ్రైండ్ చేయాలి. పేస్ట్ లా వస్తుంది. ఇది 6-7 గ్రాములు తీసుకుని గ్లాసుడు నీళ్లలో వేసి సగం అయ్యే వరకూ మరగించాలి. అప్పుడు ఫిల్టర్ చేసుకుని తేనె వేసుకుని తాగితే.. పీరియడ్స్ టైం లో ఆ పొత్తికడుపు నొప్పి తగ్గించడానికి బాగా పనికొస్తుందని నిరూపించారు. ఆ మూడు, నాలుగు రోజులు ఉదయం, సాయకాలం తాగితే చాలు.
పర్మినెంట్ సొల్యూషన్ కావాలంటే..
ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లు లీటర్ పావు వరకూ తాగేందుకు ప్రయత్నించండి. ఉదయం పూట రెండుసార్లు మలవిసర్జన అవ్వాలి. మోషన్ ఎక్కువగా ఉన్నా, గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతున్నా..గర్భాశయంకు అన్ ఈజీగా ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రేగులు క్లీన్ గా ఉంచుకోవాలి. ఒకవేళ ఎవరికైతే.. మోషన్ ప్లాబ్లమ్ ఉంటే.. ఎనిమా చేసుకుని పొట్టను బాగా క్లీన్ చేసుకోవాలి. ఇక ఆ మూడు రోజులు.. ఫ్రూట్స్ ఎక్కువగా తింటే.. పొట్టకు హాయిగా ఉంటుంది. పొత్తికడుపు నొప్పి తగ్గించడానికి ఐస్ ప్యాక్ వేసుకున్నా చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఆ చల్లదానికి మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి.
ఇంకా ఆ‌వనూనెలో ముద్దకర్పూరం వేసి మసాజ్ చేసుకుని.. వేడినీళ్లతో కాపడం పెట్టుకున్నా చాలా బాగా పెయిన్ తగ్గుతుంది. ఇంకా చాలామంది నొప్పి భరించలేక.. కాఫీలు ఎక్కువగా తాగుతారు. కానీ అసలు కెఫిన్ ఎక్కువగా ఉన్న కాఫీ అసలకే తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా తీసుకోవద్దు. త్వరగా అరిగేవి తీసుకోవాలి. అప్పుడే జీర్ణక్రియ సాఫీగా అవుతుంది.
కొంతమందికి ఎండోమెట్రియంలో ఏదైనా సమస్య ఉండటం వల్ల పెయిన్స్ వస్తాయి. మరికొందరికి ఎలాంటి సమస్య లేకున్నా.. పెయిన్స్ విపరీతంగా వస్తాయి. అలాంటివారు.. టాబ్లెట్స్ వేసుకోకుండా.. నాచురల్గా పెయిన్స్ తగ్గించుకునే మార్గాలను ఫాలో అవడమే బెటర్. సమస్య ఉండి తప్పదనుకునే వారు ఎలాగో వాడుతారు.. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేనప్పుడు కూడా పెయిన్ కిల్లర్స్ వాడటం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news