కాఫీ తాగేవారికి షాకింగ్ న్యూస్.. హార్ట్ బీట్ పై ఎఫెక్ట్..!

-

చాలా మంది కాఫీని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ప్రతిరోజూ కాఫీ తాగుతూ ఉంటారు. అయితే కాఫీ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా హార్ట్ మరియు మెటబాలిజమ్ పై ఇది ప్రభావం చూపిస్తుంది. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా.. మన శరీర భాగాలు ఆరోగ్యంగా ఉండాలి అన్నా తీసుకునే ఆహారం మరియు జీవన విధానం చాలా ముఖ్యమైనవి.

 

జాగ్రత్తగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమస్యలేమీ లేకుండా హాయిగా ఉండొచ్చు. అయితే ఈ రోజు కాఫీని తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది చూద్దాం. ఒక రీసెర్చ్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే కాఫీ తీసుకోవడం వల్ల అది హార్ట్ బీట్ పై ఎఫెక్ట్ చేస్తోందని తెలుస్తోంది.

అతిగా కాఫీ తాగడం వల్ల గుండె నార్మల్ గా కొట్టుకోకుండా ఇర్ రెగ్యులర్ గా కొట్టుకుంటుంది. అదే విధంగా 54% ప్రీమెచూర్ వెంట్రిక్యూలర్ కాంట్రక్షన్స్ గుండె యొక్క లోయర్ చాంబర్ నుండి పెరుగుతాయి అని తెలుస్తోంది. కాబట్టి కెఫిన్ ని అతిగా తీసుకోవడం మంచిది కాదు.

ఎక్కువగా కాఫీనీ తాగడం వలన బ్లడ్ ప్రెషర్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాఫీని రోజు తాగడం వల్ల లివర్ ప్రొడక్షన్ లభిస్తుంది. డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. ఒత్తిడి మంచిది. ఇలా మొదలైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి లిమిట్ గా కాఫీని తాగడం మంచిది. లేదంటే అనవసరంగా కాఫీ తో ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news