చంద్రబాబుకు మతిస్థిమితం లేదు..వరద బాధితులకు ఏం ఇస్తాడో చెప్పాలి : మంత్రి పెద్దిరెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. వరద నష్టం అంచనా వేస్తున్నామని…ఇది ప్రకృతి విపత్తు అని పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు. ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది తప్ప, ఇందులో ఎవరి తప్పులేదు అంటూ పెద్ది రెడ్డి వ్యాఖ్యానించారు.

అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు తమపై విమర్శలు చేస్తున్నాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతిస్థిమితం లేదని…తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు నాయుడు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ పెద్ది రెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడేమిస్తావో ఆయన చెప్పాలి..అంటూ చంద్రబాబు ను పెద్ది రెడ్డి ప్రశ్నించారు.