రాగి పాత్రలు వాడుతున్నారా.. అయితే మీ లైఫ్ డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్టే..!

-

పూర్వం ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు ఇళ్లలో ఎక్కువ‌గా రాగి, ఇత్త‌డి వ‌స్తువుల‌నే వాడేవారు. రాగిలో యాంటి బ్యాక్టిరియ‌ల్ నేచ‌ర్‌ ఉంటుంది. రాగితో చేసిన పాత్ర‌ల‌లో సూక్ష్మ క్రిములు చేరే అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి ఇందులో నిల్వ‌చేసే ప‌దార్థాలు చెడిపోయే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌ని ఈ మ‌ధ్య కాలంలో అంద‌రూ రాగి పాత్ర‌లు వాడ‌డం మొద‌లుపెట్టారు. దీంతో వీటికి ఎక్క‌డా లేని డిమాండ్ వ‌చ్చి ప‌డింది. అయితే వాస్త‌వానికి రాగిపాత్రల్లో వండినప్పడు, లేదా నిలువ ఉంచినప్పడు కొన్ని పదార్థాలు నెగటివ్ రియాక్షన్స్ ని ఇస్తుంటాయి. వెన్న, క్రీం , పాలను రాగి పాత్ర‌లో స్టోర్ చేసినప్పడు అది ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

అలాగే మనం ఎంతో ఇష్టపడి తినే ఊరగాయలు, పచ్చళ్లను రాగి గిన్నెల్లో స్టోర్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాటిలో ఉండే పుల్లదనానికి రాగిలో ప్రతిచర్యలు జరిగి అది తిన్నప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారచ్చు. వాస్త‌వానికి రాగి మన శరీరంలోకి చేరడం వల్ల కలిగే ఇబ్బందులు చాలానే ఉంటాయి. ముఖ్యంగా జీర్ణశయాంతర సమస్యలు కలుగుతుంటాయి. కడుపులో గ్యాస్, వాంతులు, విరేచనాలు తిమ్మిరి లాంటివి రావడానికి కారణం అవుతాయి. సో.. బీ కేర్‌ఫుల్..!

Read more RELATED
Recommended to you

Latest news