అదే చంద్రబాబుకు, నాకూ ఉన్న తేడా: సీఎం జగన్‌

-

క‌డప జిల్లాలోని సున్నపురాళ్లపల్లెలో స్టీల్ ప్లాంట్ కు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇప్పటికే ఈ ప్లాంటు కోసం 3,200 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 2 టీఎంసీల నీటిని కూడా కేటాయించింది. ఐరన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 15వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంతో 25వేలమందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తామన్నారు.

నాలుగేళ్ల అధికారంలో ఉండి ఏం చేయని చంద్రబాబు.. ఎన్నికలకు ఆరునెలలు ముందు వచ్చి శంకుస్థాపన చేయడం మోసం తప్ప మరోకటి కాదన్నారు జగన్. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలంలోనే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అలాగు మూడేళ్లలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news