ఈ మధ్యకాలంలో అనారోగ్యసమస్యలు ఎక్కువైపోయాయి. నిజానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో నడుం నొప్పి కూడా ఒకటి. ఎక్కువమంది నడుము నొప్పి తో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా నడుం నొప్పితో ఇబ్బంది పడుతున్నారా..? అయితే తప్పకుండా దాని నుంచి ఎలా బయట పడవచ్చు అనే దాని గురించి చూడండి. ఈ ఇంటి చిట్కాలని కనుక ఫాలో అయితే కచ్చితంగా నడుము నొప్పి సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ ఇంటి చిట్కాలను చూసేద్దాం.
మీకు కనుక బ్యాక్ పెయిన్ వచ్చిందంటే కొంచెం కర్పూరం కొబ్బరి నూనెలో కలిపి ఐదు నిమిషాల పాటు వేడి చేసి ఆ తర్వాత దానితో మసాజ్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గుతుంది.
ఒకవేళ మీకు నడుంనొప్పి వచ్చిందంటే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ వేసి ఆ నీటితో స్నానం చేస్తే నొప్పి తగ్గుతుంది. మంచిగా రిలీఫ్ కూడా వస్తుంది.
టీవీ చూసినప్పుడు లేదంటే పడుకున్నప్పుడు నడుము కి సపోర్ట్ గా ఒక దిండును పెట్టుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీళ్ళని బాటిల్ లో వేసి నొప్పి వున్నా చోట పెట్టుకోవడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది లేదంటే హాట్ వాటర్ బ్యాగ్ ని కూడా మీరు ఉపయోగించవచ్చు.
ఒకవేళ కనుక ఎక్కువగా మీకు నడుం నొప్పి వస్తూ ఉంటే ఆవాల నూనెతో స్నానానికి గంట ముందు మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
నడుము నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని పాలల్లో పసుపు, తేనే వేసుకుని తీసుకుంటే కూడా తగ్గుతుంది.
అల్లం టీ తో కూడా దీనికి ఉపశమనం లభిస్తుంది.
హెర్బల్ ఆయిల్ తో మసాజ్ చేస్తే కూడా త్వరగా నొప్పి తగ్గుతుంది.
నడుం నొప్పితో బాధపడే వాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది:
నడుం నొప్పితో బాధపడే వాళ్ళు సన్ ఫ్లవర్ ఆయిల్, మిక్స్ డ్ వెజిటేబుల్ ఆయిల్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.
అలాగే ప్రాసెస్ ఫుడ్ కూడా తీసుకోకండి.
పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. ఇలా ఈ విధంగా ఫాలో అయితే నడుం నొప్పి సమస్య నుండి బయటపడవచ్చు.