నడుము నొప్పితో బాధ పడుతున్నారా…? అయితే ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..!

-

చాలా మందికి ఎక్కువగా నడుము నొప్పి వస్తుంది. పురుషులు మరియు స్త్రీలు కూడా ఎక్కువగా ఈ సమస్యకి గురవుతూ ఉంటారు. అయితే ఒకవేళ నడుం నొప్పి ఎక్కువగా వచ్చి.. మీరు రిలీఫ్ పొందాలంటే కష్టమేమీ కాదు. కొంచెం ప్రయత్నిస్తే ఈ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.

మీకు కనుక బాగా నడుము నొప్పి ఉంటే హాట్ లేదా కోల్డ్ మసాజ్ చేసుకోండి. దీని వల్ల త్వరగా నొప్పి నుండి రిలీఫ్ కలుగుతుంది. ఒకవేళ నొప్పి ఒకటి లేదా రెండు రోజులు వచ్చింది అంటే అప్పుడు ఐస్ మసాజ్ చేయండి. ఎక్కువ కాలం పాటు మీకు నడుము నొప్పి వస్తుంటే హాట్ మసాజ్ చేయండి. అలానే ఇంటి చిట్కాలు కూడా బాగా ఉపయోగపడతాయి. మరి వాటి కోసం కూడా చూసేద్దాం.

వెల్లుల్లి:

మీకు కనుక నడుం నొప్పి ఎక్కువగా వస్తుంటే వెల్లుల్లిని ఉపయోగించండి. ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పేస్ట్ కింద చేసుకుని దానిని అప్లై చేయండి. అదేవిధంగా ఒక తువ్వాలును వేడినీళ్ళలో వేసి పిండేసి ఆ వెల్లుల్లి పేస్ట్ మీద తువ్వాలని పెట్టండి ఇలా అరగంట పాటు ఉంచితే నొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు.

మెంతులు ఆవాలు నూనె:

బ్యాక్ పెయిన్ సమస్య తగ్గాలంటే మెంతులు ఆవాల నూనె కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల త్వరగా నొప్పి తగ్గుతుంది.

తులసి:

మీకు కనుక నడుం నొప్పి ఉంటే ఎనిమిది నుండి పది తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించండి. నీళ్లు చల్లారిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి తాగండి ఇలా ఈ విధమైన టిప్స్ ని ఫాలో అయితే కచ్చితంగా నడుంనొప్పి తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news