వామ్మో.. షుగర్ పేషెంట్స్ రాత్రుళ్ళు ఇవి తిన్నారంటే ప్రాణానికే ప్రమాదం..

-

షుగర్ సమస్య ఈ రోజుల్లో చాలా మందికి కామన్ అయిపోయింది. షుగర్ సమస్య రావడానికి ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ కూడా కారణం అవుతుంది. కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ షుగర్ వస్తే కొన్ని రకాల ఆహారాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ లేదా భుజియా వంటివి అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఇంకా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.రాత్రుళ్ళు వీటిని తీసుకోవడం వల్ల మంట మరియ ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.కొందరికి రాత్రిపూట ఒక గ్లాసు సోడా, కూల్ డ్రింక్స్ లేదా పండ్ల రసాలను తాగే అలవాటు ఉంటుంది. అయితే ఈ పానీయాలలో ఆహారం జీర్ణం కావడమే కాకుండా చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం పూట వీటిని తాగడం వల్ల మీ బ్లడ్ షుగర్ పెరుగుతుంది.

చాలా మంది వైట్ బ్రెడ్ తింటారు. అంటే తెల్ల రొట్టె. ఇది శుద్ధి చేసిన తెల్లటి పిండి లేదా మైదాతో తయారు చేయబడుతుంది. తెల్ల రొట్టెలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చక్కెర జోడించబడింది. అవి మీ రక్తంలో గ్లూకోజ్‌ని పెంచి మరిన్ని సమస్యలను సృష్టిస్తాయి. వైట్ బ్రెడ్, వైట్ పాస్తా ఇంకా శుద్ధి చేసిన తృణధాన్యాలు వంటి వైట్ కార్బోహైడ్రేట్‌లను తినకూడదని అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సూచించింది.ఎందుకంటే వాటిలో ఎలాంటి పోషక విలువలు లేవు.పైగా ఇతర ఆరోగ్య సమస్యలకు దోహదం చేస్తాయి.

మీరు డయాబెటిస్‌తో బాధపడుతుంటే అర్ధరాత్రి మంచింగ్‌కు నో చెప్పండి. పొటాటో చిప్స్, క్రాకర్లు ఇంకా కాల్చిన గింజలు వంటి ప్యాక్ చేసిన ఆహారాలు తినకండి. వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అధిక సోడియం తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్స్ ప్రకారం, మధుమేహం లేని వ్యక్తి కంటే మధుమేహం ఉన్న వ్యక్తికి ఇది మరింత హానికరంగా మారుతుందట.

అలాగే చాలా మందికి రాత్రుళ్ళు పాలు తాగే అలవాటు ఉంటుంది. కానీ షుగర్ పేషెంట్స్ అస్సలు పాలు తాగకూడదు. పాలే కాదు.. పాలకు సంబంధించిన ఏ ఉత్పత్తులు తీసుకోకూడదు. పాలు, జున్ను, పెరుగు, టీ, కాఫీ.. ఇవన్నీ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. కాబట్టి వీటిని అస్సలు తీసుకోకూడదు.

కొంతమంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. కాజు, బాదాం, జీడిపప్పు, కిస్ మిస్, పిస్తా ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని షుగర్ పేషెంట్స్ మాత్రం అస్సలు తినకూడదని అందులోనూ రాత్రి వేళల్లో అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మధుమేహులు ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news