ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పనిభారం.. ఇలా అనేక కారణాల వల్ల చాలా మందిని నిద్రలేమి ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీంతో పలు ఇతర అనారోగ్య సమస్యలను కూడా వారు కొని తెచ్చుకుంటున్నారు. అయితే నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ ఈ ఆహారాలను తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. దాంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. నిద్రబాగా పట్టాలంటే రాత్రి పూట ఆహారం తక్కువగా తీసుకోవాలి. అలాగని పూర్తిగా తినకుండా ఉండడం కూడా మంచిది కాదు. కానీ తినే ఆహారం తక్కువగా తినాలి. దీంతో అది తేలిగ్గా జీర్ణమై నిద్ర త్వరగా పడుతుంది.
2. బాగా పండిన అరటి పండ్లను రాత్రి పూ భోజనం అయ్యాక తీసుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.
3. పాప్ కార్న్ లో ఉండే పీచు పదార్థం నిద్ర చక్కగా పట్టేలా చేస్తుంది. కనుక పాప్‌కార్న్ తిన్నా నిద్రలేమి సమస్య నుంచి తప్పించుకోవచ్చు.
4. రాత్రి పూట పాలు, పాల సంబంధ పదార్థాలను తీసుకుంటే నిద్రలేమి సమస్యను పోగొట్టుకోవచ్చు. నిద్ర సరిగ్గా పడుతుంది.
5. ద్రాక్షలను తిన్నా నిద్ర చక్కగా పడుతుంది.