డెలివరీ తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోండి..!

గర్భవతిగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో డెలివరీ అయిపోయిన తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది మహిళలు అజాగ్రత్తగా వుంటారు. దాని వలన సమస్యలు వస్తాయి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి..?, ఎలాంటి ఆహరం తీసుకోవడం మంచిది అనేది చూసేద్దాం. ఇలా వీటిని ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు.

 

Take these to stay healthy after delivery

రెగ్యులర్ గా తినడం:

డెలివరీ తర్వాత పాలిచ్చే మహిళలు 2100K క్యాలరీలు రోజుకి తీసుకోవాలి. అదే పాలు ఇవ్వకపోతే 400 నుండి 500 కేలరీలు తీసుకోవాలి.

సమతుల్యమైన ఆహారం:

ఆహారంలో విటమిన్స్, మినరల్స్ మొదలైన పోషకాలు ఉండేటట్టు చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, నట్స్, గింజలు అన్నీ డైట్ లో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. అలానే నెయ్యి, ఆలివ్ ఆయిల్, అవకాడో, ఫిష్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఇవి కూడా తీసుకోండి.

హైడ్రేషన్:

ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కనీసం రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీళ్లు తీసుకునేలా చూసుకోండి. అలానే డైరీప్రొడక్ట్స్ లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వాటిని కూడా మీరు మీ డైట్ లో తీసుకోండి.

కాఫీ, షుగరీ డ్రింక్స్ వంటి వాటిని అసలు తీసుకోవద్దు ఇలా డెలివరీ అయిపోయిన తర్వాత ఆహార విషయంలో ఈ మార్పులు చేస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.