చాలామంది ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కిడ్నీల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. కిడ్నీ ఆరోగ్యం దెబ్బతిందని ఎలా చెప్పచ్చు..? ఈ లక్షణాలని బట్టి మనం కిడ్నీ సమస్య ఉందని తెలుసుకోవచ్చు. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఈ లక్షణాలు కనపడతాయి. రాత్రి పూట పదేపదే మూత్ర విసర్జనకు లేవాల్సివస్తున్నట్లయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. రాత్రి పూట ఎక్కువగా యూరిన్ వస్తూ ఉన్నట్లయితే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది. అలాగే మీరు యూరిన్ వెళ్లేటప్పుడు వాసనని గమనించినట్లయితే కచ్చితంగా కిడ్నీ సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
దుర్వాసనతో పాటుగా యూరిన్ డార్క్ గా ఉన్నట్లయితే కూడా కిడ్నీల సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవాలి. కాళ్లు, కళ్ళు వాపులకి గురైనట్లయితే కూడా కిడ్నీ సమస్య వచ్చిందని అర్థం చేసుకోవాలి. కిడ్నీలు సరిగ్గా బయటకి వేస్ట్ ని పంపించకపోయినప్పుడు కాళ్లు వాపులు కలుగుతాయి. మూత్ర విసర్జన చేసినప్పుడు నురగ వస్తున్నట్లయితే కూడా కిడ్నీల సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
ఇది కూడా మీరు గమనించినట్లయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. విపరీతంగా నీరసం, అలసట ఉంటే కూడా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతిందని అర్థం చేసుకోవాలి. వికారం, వాంతులు కూడా కిడ్నీల సమస్యకు కారణమే. వికారం, వాంతులతో మీరు బాధపడుతుంటే కూడా కిడ్నీల సమస్య ఉందని అర్థం చేసుకుని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. డిస్ కంఫర్ట్ గా ఉండడం, విశ్రాంతి లేకపోయినట్లు ఉండడం కూడా కిడ్నీల సమస్యకు కారణం అని చెప్పొచ్చు. ఈ లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు.