చిన్నారిపై అఘాయిత్యం బాధేసింది. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించింది. అలిమేలుమంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అయితే చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. చిన్నారి కుటుంబానికు సొంత ఇంటిని నిర్మించి ఇస్తాం అని అన్నారు. అలాగే ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం. పోలీసులు వెంటనే స్పందించారు.
మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. ఈ కేసును ప్రత్యేక కోర్టుకు అప్పచెబుతాం. మూడునెలల్లో నిందితుడిని శిక్షిస్తాం. గత ఐదేళ్ళలో పోలీసు వ్యవస్థను వైసిపి నిర్వీర్యం చేసింది. ఈ ఘటనను రాజకీయం చేయడం విడ్డూరం. ఎక్కడ ఘటన జరిగినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోంది. చిన్నపిల్లల మరణాల్ని వైసిపి రాజకీయం చేయడం బాధాకరం. ప్రభుత్వంపై బురద చల్లొద్దు. క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయి.పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదు. ఏపీలో సిసి కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డలా చూస్తున్నారు అని మంత్రి పేర్కొన్నారు.