గుండె ఆరోగ్యం కోసం వీటిని తీసుకుంటే మంచిది..!

-

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం గుండె. అలాంటప్పుడు మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవన శైలిని తప్పక మార్చుకోవాలి. గుండె జబ్బులు లేదా గుండె పోటు నివారించడానికి జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలి. గుండె సురక్షితంగా ఉండాలి అంటే మనం తీసుకునే రోజు వారి ఆహారం లో ఒమేగా 3 ఫ్యాటి ఆమ్లాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. నిజానికి మనం తినే కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. వివరాల లోకి వెళితే..

అరటిపండు :

గుండె ఆకృతికి అరటిపండుకు ఎలాంటి పోలికలేక పోయినా దీనిలో పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తాయి. రక్తపోటును తగ్గించడం వల్ల గుండె పై ఒత్తిడి తగ్గి గుండె పోటును నివారిస్తుంది. అంతే కాకుండా దీనిలో విటమిన్ బి6 ,సి ,పీచుపదార్థాలు మొత్తం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఎల్లప్పుడూ ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని తినడం మేలు.

ద్రాక్ష :

ద్రాక్ష పండ్లు మన రక్తనాళాలల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించుతాయి. ద్రాక్ష లో ఉండే పోషకాలు హై కొలెస్ట్రాల్ ను తగ్గించి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండె జబ్బులను నివారిస్తాయి.

ఆపిల్ :

ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్లెట్లు, రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దీంతో రక్తనాళాలు మూసుకుపోకుండా ఉంటాయి. కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఆపిల్ కు కూడా ఉంది. ఈ విధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

నారింజ పండ్లు :

నారింజ పండ్లు నిమ్మజాతికి చెందినవి. నారింజ, బత్తాయి వంటి పండ్లు గుండెకు ఎంతో మేలు చేసేవే. బాగా పండిన నారింజ పండులో విటమిన్ ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. ఇవే కాకుండా ఫోలేట్ పొటాషియం మరియు ఫైబర్ కూడా ఎక్కువే. పొటాషియమ్ ఉండడంతో రక్తపోటు తగ్గుతుంది దీంతో గుండెకు రక్షణ కలుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news