నిద్రలేమి సమస్యకు ఈ నాలుగు విటమిన్ లోపాలే ప్రధాన కారణమట..!

-

నిద్రలేమి.. చాలా చిన్న పదం.. కానీ ఈ సమస్య మాత్రం ఘోరంగా ఉంటుంది. నైట్ పడుకున్నాక.. ఎంత ట్రై చేసినా నిద్రరాక, ఏం చేయాలో తెలియక బెడ్ మీద బెల్లీ డ్యాన్స్ చేసే వారికే ఈ సమస్య గురించి తెలుస్తుంది. మనిషికి కడపునిండా అన్నం.. కంటినిండా నిద్ర ఉంటే చాలు ఆరోగ్యంగా ఉన్నట్లే.. రోజంతా చేసిన కష్టానికి నిద్రద్వారానే రెస్ట్ ఇవ్వాలి.. కానీ ఈరోజుల్లో ఎంతోమంది సరైన నిద్రలేక నానాతంటాలు పడుతున్నారు. నిద్రలేమి అనేది.. సకల రోగాలకు గేట్ పాస్ లాటింది.. అది వచ్చిదంటే.. దీర్ఘరోగాలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లే. పైకి హెల్తీగానే ఉంటారు. మరి ఎందుకు నిద్రరావడం లేదు. కొన్ని మానసిక కారణాలైతే.. మరికొన్ని లోపాలే.. అవునండీ..బాడీలో కొన్ని విటమిన్లు లోపిస్తే.. నిద్ర అస్సలు రాదట. మనకు ఆ విటమిన్లు లోపం ఉన్నట్లు కూడా తెలియదు. ఈరోజు.. ఏ ఏ విటమిన్లు.. లోపిస్తే నిద్రరాదో చూద్దాం.
విటమిన్ డి : విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది వాపును నివారిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, విటమిన్ డి నిద్రను నియంత్రించే కణాలను ప్రేరేపించడానికి దారితీస్తుందని తేలింది.. పుట్టగొడుగులు, సాల్మన్, సార్డినెస్, గుడ్డు పచ్చసొన, నువ్వుల ఉండ, నాటు ఆవు జున్నులో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. ఇవి తింటుంటే బాడీకీ సరిపడా విటమిన్ డీ అందుతుంది. విటమిన్ డీ లోపిస్తే.. చాలా ప్రమాదం.. ఎముకలు గుల్లబారిడానికి కూడా విటమిన్ డీలోపం కారణం అవుతుంది.. కాబట్టి.. వారానికి రెండు మూడు సార్లైన పైన పేర్కొన్నవి తినేందుకు ప్రయత్నించమంటున్నారు వైద్యులు.
విటమిన్ ఇ : విటమిన్ ఇ నిద్ర లేమిని నివారించడంలో సహాయపడుతుంది, ఇది తరచుగా జ్ఞాపకశక్తి కోల్పోవడం ,దీర్ఘకాలంలో మెదడు క్షీణతకు దారితీస్తుంది. బాదం, పొద్దుతిరుగుడు నూనె , గింజలు, గుమ్మడికాయ గింజల, బచ్చలికూర , ఎరుపు బెల్ పెప్పర్స్ వంటి వాటిలో విటమిన్ ఈ ఉంటుంది. డైలీ నానపెట్టిన బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడిగింజలు తింటుంటే.. ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.
విటమిన్ B6: శరీరానికి తగినంత విటమిన్ B6 అందనప్పుడు, శరీరం నిద్రను ప్రేరేపించే కణాలను ఉత్పత్తి చేయడాన్ని నిలిపివేస్తుంది. తద్వారా నిద్రలేమికి దారితీస్తుంది. అందువల్ల, ప్రశాంతంగా నిద్రపోవడానికి, అరటిపండ్లు, వేరుశెనగలు, ఓట్స్, పంది మాంసం, చికెన్, చేపలు వంటివాటిని తీసుకోవటం మీ డైట్ లో భాగం చేసుకోవడం ఉత్తమం. ఇంకా విటమిన్ b6 వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయనేది ఈ సైట్ వివరంగా అందించబడింది.. ఓసారి చూడండి.
విటమిన్ సి : సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుందని మనందరికి తెలుసు. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వాపును తగ్గించి, రోగనిరోధక వ్యవస్థ, ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తాయి. నారింజ, బెర్రీలు, మిరియాలు, బ్రోకలీ, నిమ్మకాయలను తీసుకోవటం ద్వారా నిద్రలేమిని తొలగించుకోవచ్చు.
ఒత్తిడి , ఆందోళన అనేక ఇతర కారణాల వల్ల కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. చాలామందికి జీవితంపై విపరీతమైన ఆందోళన ఉంటుంది. లైఫ్ ఏంటో, ఎటుపోతుందో. అనుకున్న లక్ష్యాలను సాధిస్తానా లేదా అనే ప్రశ్నలతో ఎప్పుడూ యుద్దం చేస్తూనే ఉంటారు. వీలైనంత వరకూ మనసును, మెదడుని తక్కువ ఆలోచింపచేసుకోవాలి. మనలో మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే.. అంత ప్రశాంతంగా ఉండగలమట. జరిగేది జరగక మానదు.. మనం ఎందుకు ఎక్కువ స్ట్రెయిన్ అవడం. మీరు చేయాల్సింది చేయండి.. ఫలితం అదే వస్తుంది అంటున్నారు మానసిక నిపుణులు. ఫైనల్ గా చెప్పేదంటే.. మనసును ప్రశాంతతో.. బాడీని పోషకాలతో నింపితే.. నిద్రలేమి కాదు కదా.. ఇక ఏ సమస్య ఉండదు బాస్.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news