కరోనా వైరస్ పై ‘మనలోకం’ ఇచ్చే సలహా ఇదే…!

-

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న సంగతి తెలిసిందే. చైనాలో ఎక్కడో ఊహాన్ నగరంలో పుట్టిన ఈ వ్యాధి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా ఈ వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తుంది. దీనితో వేలాది మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క చైనా దేశంలోనే దాదాపు 4 వేల మందికి ఈ వ్యాధి వేగంగా సోకింది.

కేవలం గంటల వ్యవధిలోనే వందల మందికి ఈ వ్యాధి సోకడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. చైనా ఇంకా మందు కనుకున్నే పనిలోనే నిమగ్నమై ఉంది. ఇదిలా ఉంటే మన దేశంలో కొందరు డాక్టర్లు డ్రామాలు ఆడటానికి రెడీ అయ్యారని సమాచారం. సాధారణంగా చలికాలం కాబట్టి జలుబు దగ్గు వంటివి వస్తూ ఉంటాయి. అవి సర్వ సాధారణంగా జరిగేవే.

మన దేశంలో ఉన్నట్టుండి గాలి ఆడక చెమటలు పట్టినా అంబులెన్స్ ని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆస్పత్రికి జలుబు దగ్గరు అని వెళ్తే కొందరు వైద్యులు ఇది కరోనా లక్షణం అని, మా దగ్గర దీనికి మందు ఉందని చెప్పి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. ఆయుర్వేదం, హోమియోపతి మందులు అమ్మే వాళ్ళలో కొంత మంది కూడా దీనికి మా దగ్గర మందు ఉందని వెళ్ళిన వారికి చెప్పి వసూలు చేసే అవకాశం ఉంది.

కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. మీకు మనలోకం కూడా సూచిస్తుంది. ఎటువంటి తప్పుడు ప్రచారాలు మీరు నమ్మొద్దు అని మనలోకం మీకు విజ్ఞప్తి చేస్తుంది. ఇంకా అది మన దేశంలో ఎవరికి సోకలేదు. సోకే అవకాశాలు కూడా చాలా తక్కువ. హైదరాబాద్ కి కూడా అది రాలేదు. కాబట్టి మీరు ఎక్కడా కూడా భయపడి డబ్బు వృధా చేసుకోవద్దు. అనుమానం ఉంటే హైదరాబాద్ లో ప్రత్యేక చికిత్సలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి. తీసుకునే జాగ్రత్తలు సరిగా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news