మన తెలంగాణాలో జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్దమైంది. దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ జాతరకు తెలంగాణా కుంభమేళా అనే పేరు కూడా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఇది. గిరిజన సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు చూపించే ఈ పండుగ దట్టమైన అడవుల్లో, కొండ కోణాల మధ్య జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు ఎంతో విశిష్టత ఉంది.
ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజుల రాకతో మొదలయ్యే జాతర మూడు రోజుల తర్వాత 8న వన ప్రవేశంతో ముగుస్తుంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దె మీదకు చేరుకుంటుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 8న దేవతల వన ప్రవేశం ఉంటుంది. అక్కడితో జాతర ముగుస్తుంది.
దీని కోసం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. మేడారంలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేసారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను కూడా ఈ జతార కోసం ఏర్పాటు చేసింది. ఇక అక్కడికి వెళ్ళాలి అనుకున్న వారి కోసం ఆర్టీసి బస్సు చార్జీలను ప్రకటించింది.
ఓ సారి బస్సు ఛార్జీల వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్ నుంచి రూ.440
ఖాజీపేట్ నుంచి రూ.190
హన్మకొండ నుంచి రూ.190
వరంగల్ నుంచి రూ.190
పరకాల నుంచి రూ.190చిట్యాల నుంచి రూ.200
ఘణపురం(ము) నుంచి రూ.140
భూపాలపల్లి నుంచి రూ.180
కాటారం నుంచి రూ.210
కాళేశ్వరం నుంచి రూ.260
సిరోంచ నుంచి రూ.300
ఏటూర్ నాగారం నుంచి రూ.60
కొత్తగూడ నుంచి రూ.240
నర్సంపేట్ నుంచి రూ.190
మహబూబాబాద్ నుంచి రూ.270
తొర్రూర్ నుంచి రూ.280
వర్ధన్నపేట్ నుంచి రూ.230
స్టేషన్ ఘన్‌పూర్ నుంచి రూ.240
జనగామ నుంచి రూ.280 వసూలు చేస్తారు.