Cancer: వంటగదిలో ఈ 3 తీసేస్తే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉండదు..!

-

Cancer: క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్యాన్సర్ కారణంగా చాలామంది మరణిస్తున్నారు కూడా. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటుగా వివిధ రకాల క్యాన్సర్లు మనుషుల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఎప్పుడు కూడా మన ఇంట్లో మంచి పద్ధతుల్ని పాటించాలి. కొన్ని తప్పులు చేయడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మన ఇంట్లో తెలియక వాడే కొన్ని క్యాన్సర్ కి కారణం అవుతాయట. మరి క్యాన్సర్ కి కారణమైన ఆ మూడు వస్తువుల గురించి ఇప్పుడు చూద్దాం. వీటిని వీలైనంతవరకు తొలగించడం మంచిది లేదంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుంది.

సువాసన వెదజల్లే కొవ్వొత్తులు

సెంటెడ్ క్యాండిల్స్ ని చాలా మంది ఇళ్లల్లో వాడుతూ ఉంటారు అయితే ఈ కొవ్వొత్తుల్లో
పలు పదార్దాలు ఉంటాయి. అవి హార్మోనల్ లెవెల్స్ పై ప్రభావం చూపిస్తాయి ప్రమాదకరమైన హైడ్రో కార్బన్స్ ని ఎక్కువగా విడుదల చేసి కాలుష్యనికి కారణమవుతాయి. బెంజిన్ ని బయటికి విడుదల చేస్తాయి. కళ్ళు, ముక్కు, గొంతు, చర్మం పై ప్రభావం చూపిస్తాయి. తలనొప్పి, యాంగ్జైటీ వాటి వాటిని కలిగించి ప్రమాదకరమైన బ్లడ్ క్యాన్సర్ కి కూడా కారణం అవుతాయి.

ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్

చాలామంది ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్స్ ని వాడతారు. అయితే ఇవి అజీర్తి సమస్యలతో పాటుగా క్యాన్సర్, రిప్రొడక్టివ్ సమస్యల్ని కలిగిస్తాయి. ప్లాస్టిక్ బోర్డ్స్ కి బదులుగా చెక్క బోర్డ్స్ ని వాడడం మంచిది, వాటిని క్లీన్ చేయడానికి ఆర్గానిక్ డిష్ వాష్ ని ఉపయోగించండి.

నాన్ స్టిక్ ప్యాన్స్

గీతాలు పడిపోయిన నాన్ స్టిక్ ప్యాన్స్, పాత పడిపోయిన నాన్ స్టిక్ ప్యాన్స్ మైక్రో ప్లాస్టిక్స్ ని విడుదల చేస్తాయి క్యాన్సర్ కి కారణం అవుతాయి. ఇవి కెమికల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయని వీటి వలన కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news