కంటిచూపును మెరుగుపరిచే ఇంటి చిట్కాలు మీకోసం..

-

కంటిచూపుకి సంబంధించిన సమస్యలు చాలా సహజంగా అయిపోయాయి. కరోనా వల్ల ఇంటి వద్ద నుండే పనిచేయడం వల్ల జీవన విధానంలో మార్పులు రావడం వల్ల వేళ కాని వేళల్లో కంప్యూటర్ ముందు గంటల తరబడి ఉండడం దీనికి ప్రధాన కారణంగా తోస్తుంది. ఇదే కాదు ప్రస్తుత జీవన విధానంలో మన కంటిచూపుని తగ్గించే కొన్నింటిని తెలుసుకుందాం.

అస్తవ్యస్తమైన జీవన విధానం
విటమిన్ ఏ లోపం
వయస్సు పెరుగుతున్నప్పుడు కళ్ళ గురించి శ్రద్ధ తీసుకోకపోవడం
కలుషిత వాతావరణం
ఆల్కహాల్ సేవించడం, పొగ తాగడం
అధిక వేడి, మెదడు బలహీనంగా ఉండడం
ఎక్కువ కాంతిలో ఎక్కువ సేపు చదువుకోవడం

ఐతే కంటిచూపుని మెరుగుపర్చుకోవడానికి ఏం చేయాలో చూద్దాం.

ఉసిరి:

ఉదయం పూట ఉసిరికి తేనె కలుపుని తాగితే బాగుంటుంది. ఉసిరిలో ఉండే లక్షణాలు కంటిచూపుకి రక్షణనిస్తాయి.

త్రిఫల

తానికాయ, కరక్కాయ, ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల. ఈ మూడింటిని పొడులుగా చేసి ఒక దగ్గర పెట్టుకుని దాన్ని నీటిలో పోసుకుని ఒక రాత్రిపూట నానబెట్టాలి. ఆ తర్వాత మర్నాడు ఆ నీటిని వడపోసి కళ్ళని కడుక్కోవాలి.

దానిమ్మ

దానిమ్మ ఆకులని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ని కళ్ళకి పూసుకుంటే బాగుంటుంది.

ఆకుకూరలు, నిమ్మ, క్యారెట్, మెంతి వంటి కూరగాయలు కూడా కంటిచూపును మెరుగుపరుస్తాయి.

ఇంకా, రోజూ ఉదయం, సాయంత్రం ఒక నిమిషం పాటు కళ్ళని మూస్తూ తెరుస్తూ వ్యాయామం చేయాలి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రతీ ఇరవై నిమిషాలకి ఒకసారి ఇరవై సెకన్ల పాటు గ్యాప్ తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news