మరీ అంత స్పైసీ మంచిది కాదట..ఈ సమస్యలు ఎదుర్కోక తప్పదు..

-

సుగంధ ద్రవ్యాలకు ఇండియా పుట్టినిల్లు లాంటిది. అందులోనే తెలుగు వాళ్లు స్పెసీగా తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. చప్పగా ఉండేవి మనకు అస్సలు నచ్చవు. అయితే కారం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు అంటున్నారు. సరిపడా కారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత అవసరమో అది మితిమీరి తీసుకోవడం అంతే ప్రమాదం. కారం ఎక్కువగా తింటే ఉప్పు కూడా అంతే తినాల్సి వస్తుంది. ఈ రెండు విపరీతంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక ఉప్పు, కారం వినియోగం వల్ల శరీరానికి కలిగే నష్టాలు ఏంటంటే..

మసాలా, ఎర్ర మిరపకాయ ఏదైనా వంటకానికి రుచిని జోడిస్తుంది. పప్పుతో సహా అనేక వంటకాలు అది లేకుండా అసంపూర్ణంగా కనిపిస్తాయి. కానీ ఎక్కువ మిర్చి పౌడర్ వాడడం లేదా మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం ఉంది. కారంపొడి అధిక వినియోగం కడుపుకు మంచిది కాదు. ఇది పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులు డీప్‌ఫ్రై చేసినప్పుడు అవి పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తాయి. త్వరగా జీర్ణం కావు.. ఫ్రీరాడికల్స్‌ను ఫామ్‌ చేస్తాయి.

ఎర్ర మిరపకాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది కడుపులో ఎసిడిటీని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు… అలాగే కొంతమంది తరచుగా గుండెల్లో మంట అంటుంటారు. అలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఎర్ర మిరపకాయలు తీసుకోవడం మానేయండి. మిరపకాయలే కాదు.. కారంగా ఉన్న వేటిని అతిగా తినకూడదు. బాడీని వీలైనంత కూల్‌గా ఉండేవి అంటే చలవ చేసేవి తినడం వల్ల గుండెలో మంట సమస్య తగ్గుతుంది.

సాధారణంగా వైద్యులు ఎర్ర మిరపకాయలను తక్కువగా తినమని సూచిస్తారు. ఎందుకంటే కడుపులో పుండు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి.. ముఖ్యంగా కారం పొడి చాలా ప్రమాదకరం. దీని కణాలు కడుపు, ప్రేగులకు అంటుకుంటాయి. క్రమంగా ఇది అల్సర్లకు కారణమవుతుంది. అల్సర్‌ వచ్చిదంటే అతిగా కాదు కదా..అసలు తినడానికే ఉండదు..

కాబట్టి మరీ అంత కారంగా ఉండేవి తినడం మానేయండి. వయసుమీద ఉన్నప్పుడు విపరీతంగా కారం, ఉప్పు తింటే.. ఒక స్టేజ్‌ వచ్చే సరికి సరిగ్గా భోజనం చేస్తేనే ప్రమాదం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news