మృదువైన, ముడుతలు పడని చేతుల కోసం ఏం చేయాలంటే..?

-

చర్మ సంరక్షణ అనగానే ముఖం అందంగా కనిపించడం మాత్రమే అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముఖంపై ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారు. ఐతే వయస్సు పెరగే లక్షణాలనేవి కేవలం ముఖంపై మాత్రమే కనిపించవు. చేతులు ముడుతలుగా ఏర్పడటం అందులో ముఖ్యమైన సమస్య. రకరకాల కారణాల వల్ల మృదువుగా ఉండాల్సిన చేతుల్లో ముడుతలు ఏర్పడతాయి. వీటి నుండి బయటపడి చేతుల్ని మృదువుగా చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఇంట్లో:

ఇంట్లో ఉన్నప్పుడు వస్తువులను శుభ్రపరుస్తున్నప్పుడు గానీ రసాయనాలతో ఏదైనా క్లీన్ చేస్తున్నప్పుడు గానీ గ్లవ్స్ ధరించడం మంచిది. రసాయనాల కారణంగా చర్మం మృదుత్వం కోల్పోతుంది. పొడిగా ఉన్న చేతులకి మాయిశ్చరైజర్ అప్లై చేయడం మర్చిపోకండి. ఇంటి నుండి బయటకి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ లోషన్ మర్దన చేసుకోండి. రాత్రిపూట పడుకునే ముందు విటమిన్ సి, ఈ, బీ3 గల సీరమ్స్ అప్లై చేసుకోవాలి.

లేజరు

లేజర్ చికిత్సలు చర్మం యొక్క ఉపరితలంపై చేయబడతాయి, ఇది నల్ల మచ్చలు, గీతలు వదులుగా ఉండే చర్మం నుండి బయటపడటానికి మీకు సహాయపడుతుంది.

హైలూరోనిక్ ఆమ్లం కలిగిన డెర్మల్ ఫిల్లర్ ద్వారా ముడుతలు తగ్గించవచ్చు. మృదువైన చర్మం కోసం మేలైన పద్దతుల్లో ఇది కూడా ఒకటి.

కొవ్వు బదిలీ

ఈ పద్ధతిలో, కొవ్వు కణాలు కడుపు లేదా తొడ వంటి రోగి యొక్క సొంత శరీర భాగం నుండి తీసుకోబడతాయి మరియు తరువాత వాటిని ప్రాసెస్ చేసి రోగి చేతిలో ఇంజెక్ట్ చేస్తారు.

ఐతే ఈ పద్దతులన్నీ చేతుల మీద ముడుతలు పోగొట్టడానికి బాగా సాయపడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news