పెర్ఫ్యూమ్‌తో డిప్రెషన్‌ … నమ్మలేని నిజం!

-

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ పెర్ఫ్యూమ్‌ లేనిదే, బయటకు వెళ్లలేరు. అంతగా అలవాటైంది. రోజూ ఆఫీసుకు, ఎక్కడైనా ప్రయాణాలు చేసే ముందు రోజూవారీ అలవాటు అయిపోయింది. గుప్పుమని వచ్చే సువాసన, వివిధ ఫ్లేవర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. సెంట్‌ను చాలా మంది ఇష్టపడతారు. కానీ, దీంతో ఆరోగ్యానికి హాని కలిగించే గుణాలున్నాయని మీకు తెలుసా? దీనిపై నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

Perfume-
Perfume-

ముఖ్యంగా వివిధ రసాయనాలు వాడి, పెర్ఫ్యూమ్‌ను తయారు చేయడం వల్ల అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. రకరకాల ఫ్లేవర్ల కోసం కంపెనీలు ఈ సెంట్లలో ప్రమాదకర కెమికల్స్‌ కలుపుతారు. కానీ, వాటి వివరాలు మాత్రం చెప్పడం లేదు. సెంట్‌ను వాడుతున్న వారిలో రెండు శాతం మంది విష ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. వీటిని అధికంగా వాడడం వల్ల చర్మ సమస్యలు తప్పడం లేదు. పెర్ఫ్యూమ్స్‌ వల్ల గాయాలు కూడా అవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ముఖ్యంగా సెంట్‌ ఎక్కువగా వాడటం వల్ల డిప్రెషన్‌ సమస్య పెరుగుతుంది. అది నానాటికీ ఎక్కువై, వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల వీలైనంతవరకూ సెంట్లు, పెర్ఫ్యూమ్స్‌కి దూరంగా ఉండమని సూచిస్తున్నారు.అందుకే ఎక్కువ శాతం పెర్ఫ్యూమ్‌ వాడటం తగ్గించాలి. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉంటేనే మేలు. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకుని నిలపడటానికి, కంపెనీలు సామాన్యులను పట్టించుకోదు. దీంతో వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news