తల్లి అవ్వాలనుకుంటున్నారా..? అయితే గర్భిణీ అయ్యే అవకాశాలని ఇలా పెంపొందించుకోండి…!

-

ఒక శిశువుకి జన్మనివ్వడం అనేది నిజంగా గొప్ప వరం. మీరు కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అవ్వలేకపోతుంటే మీ లైఫ్ స్టైల్ విషయంలో ఈ మార్పులు చేసుకోండి. తీసుకోవాల్సిన డైట్ నుండి ఒత్తిడి వరకు చాలా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ కనుక మీరు కన్సీవ్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే ఈ మార్పులు తప్పక చేయాల్సిందే. అప్పుడు తప్పక మీరు గర్భవతి అవుతారు.

 

సిగరెట్, ఆల్కహాల్ మరియు కెఫిన్ కి దూరంగా ఉండండి:

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ పురుషుల మాత్రమే కాదు మహిళలకు కూడా సిగరెట్, మందు వాటికి అలవాటు పడ్డారు. మీకు కూడా ఈ అలవాట్లు ఉంటే మానేయండి. అదేవిధంగా కెఫిన్ ను తగ్గించడం మంచిది.

ఒత్తిడికి దూరంగా ఉండండి:

ఒత్తిడి వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. తీవ్ర ఒత్తిడికి గురవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల కూడా కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి నుండి కూడా దూరంగా ఉండాలి.

ప్రినేటల్ సప్లిమెంట్స్ తీసుకోండి:

కేవలం గర్భిణీలు మాత్రమే ప్రినేటల్ విటమిన్స్ తీసుకోవాలి అనేది చాలామందిలో ఉన్న అపోహ. ఎవరైతే కన్సీవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళు ఫోలిక్ యాసిడ్ వంటి వాటిని డాక్టర్ ని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. ఇది మీకు, మీ బిడ్డకి కూడా మంచిది.

ఆరోగ్యకరమైన బరువు ఉండటం:

ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండటం మంచిది కాదు. మీరు బాగా బరువుగా ఉన్నట్లయితే తగ్గడం మంచిది ఇలా చేయడం వల్ల కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గడానికి వ్యాయామ పద్ధతుల్ని ఎంచుకోవచ్చు. అలానే డైట్ లో కూడా మార్పులు చేయవచ్చు. అలానే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి కన్సీవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను డైట్ లో తీసుకుంటే త్వరగా గర్భిణీ అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news