బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసం..!

Join Our Community
follow manalokam on social media

చాలా మంది బరువు తగ్గడానికి అనేక విధాలని అనుసరిస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నారా..? కానీ బరువు తగ్గ లేదా..? అయితే ఇది పూర్తిగా చూడండి. దీనిలో మీకు కొన్ని ఉపాయాలు ఉన్నాయి. వాటిని కనుక మీరు అనుసరించారు అంటే తప్పకుండా బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇక పూర్తి వివరాలకు వెళ్ళిపోతే..

బరువు తగ్గడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. మన ఇంట్లో కూడా దీనిని విరివిగా వాడుతూ ఉంటాము. దీనివల్ల అధిక కొవ్వు కరిగి బరువు తగ్గడానికి వీలవుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా తరిమికొడుతుంది.

జీలకర్ర నీళ్లు ఎలా తీసుకోవాలి..?

దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. కాబట్టి వేగంగా బరువు తగ్గడానికి మీరు మూడు నుంచి నాలుగు సార్లు రోజుకి తీసుకోవచ్చు. ఉదయాన్నే ఒక సారి, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత మరొకసారి, రాత్రి భోజనం అయ్యాక ఒకసారి, నిద్రపోయే ముందు ఒకసారి ఇలా తీసుకోవచ్చు.

మామూలుగా జీలకర్ర లో నీళ్ళు వేసుకొని తాగడం వల్ల కొన్ని కొన్ని సార్లు మీకు ఆ రుచి నచ్చకపోవచ్చు. కాబట్టి మీరు దానిలో కొంచెం దాల్చిన చెక్క పొడి వేసుకుని తీసుకోవచ్చు. పైగా దీని లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

ఒక రాత్రి అంతా జీలకర్రని నానపెట్టేసి ఉదయాన్నే తాగే ముందు దాల్చిన చెక్క పొడి లేదా అల్లం పొడి వేసుకోవచ్చు. కొద్దిగా తేనె వేసుకుని తియ్యగా తీసుకోవచ్చు. అలానే నిమ్మరసం కూడా కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.

అలానే మరో ఉపాయం ఉంది. అదేమిటంటే మెంతులు, జీలకర్ర కలిపి తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా నీళ్లను మరిగించి వాటిలో మెంతులు, జీలకర్ర వేసి మరిగించి తర్వాత వడకట్టి ఆ నీళ్లు తాగడం మంచిది. ఇలా ఈ పద్ధతుల్లో ఏదైనా అనుసరించవచ్చు. వీటివల్ల నిజంగా మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...